హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలో వరుణుడి బీభత్సం కొనసాగుతున్నది. పలుచోట్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయి. చెట్లు కూలిపోయాయి. నివాసాలు ధ్వంసమయ్యాయి. షిమ్లా(Shimla) ఏరియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. పలుచోట్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయి. చెట్లు కూలిపోయాయి. నివాసాలు ధ్వంసమయ్యాయి. షిమ్లా ఏరియాలో శుక్రవారం కొండచరియలు (Landslides) విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. ఘటనా ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన స్పెషల్ టీమ్స్ శిథిలాల నుంచి 16 మృతదేహాలను వెలికితీశాయి.
వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు (CM Sukhwinder Singh) సందర్శించారు. రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా కాగా, ఈ జల విలయాన్ని ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటిస్తున్నట్లు సీఎం తెలిపారు. కేంద్రం ఆదుకోవాలన్నారు. మరోవైపు పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 300 మందిని సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు రక్షించాయి. ఇప్పటివరకు దాదాపు 5 వేల ఎకరాల పంట నీటమునిగినట్లు అధికారులు తెలిపారు. భాక్రా డ్యామ్ (Bhakra Dam) నుంచి అదనపు నీటిని బియాస్ నదిలోకి విడుదల చేయడం వల్ల హోషియార్‌పుర్, గురుదాస్‌పుర్, రూప్‌నగర్, కపుర్తలా జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.
#WATCH | Himachal Pradesh: Drone visuals of rescue operations that are underway in Shimla after heavy rains battered several areas pic.twitter.com/p0IyUIuvkr