»The First Hydrogen Bus Is Ready The Center Will Start Trials
Hydrogen Bus: తొలి హైడ్రోజన్ బస్సు రెడీ..ట్రయల్స్ ప్రారంభించనున్న కేంద్రం
దేశంలో తొలి హైడ్రోజన్ బస్సును నడిపేందుకు కేంద్రం సద్ధమైంది. మొదటగా ఆ బస్సును మరో మూడు నెలల పాటు సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో కేంద్రం పరీక్షించనుంది.
దేశంలో తొలి హైడ్రోజన్ బస్సు (Hydrogen Bus) సిద్ధమైంది. పెట్రోల్ (Petrol), డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్‌తో నడిచే వాహనాలను తీసుకొచ్చేందుకు కేంద్రం ఎప్పటి నుంచో ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగా మొదటగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ వస్తోంది. దాంతో పాటుగా హైడ్రోజన్‌తో నడిచే వాహనాలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రోజన్‌తో నడిచే బస్సు కమర్షియల్ ట్రయల్స్‌కు రెడీ అయ్యింది. సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో ఉండే లద్దాఖ్ ప్రాంతంలో మొదటగా ఈ హైడ్రోజన్‌తో నడిచే బస్సును నడిపేందుకు సిద్దమైంది.
ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ (NTPC) అశోక్ లేల్యాండ్స్ (Ashok Laylands)తో కలిసి హైడ్రోజన్ బస్సులను రూపొందించింది. ఇందులో ఒక్కో బస్సు ఖరీదు రూ.2.5 కోట్లు కావడం విశేషం. మొత్తం 5 బస్సులను లేహ్ అడ్మినిస్ట్రేషన్‌కు ఎన్టీపీసీ అప్పగించింది. అంతేకాకుండా తొలి బస్సును అత్యధికుల సమక్షంలో నడిపేందుకు ప్రణాళిక రచిస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తికి 1.7 మెగా వాట్ల సోలార్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
మరో మూడు నెలల పాటు ఈ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక వేస్తోంది. త్వరలోనే కమర్షియల్ ట్రయల్స్ (Commercial Trails) కూడా ప్రారంభం కానున్నట్లు కేంద్రం వెల్లడించింది. హైడ్రోజన్ బస్సులు (hydrogen Bus) నడిపే సమయంలో ఒక వేళ నష్టాలు వాటిళ్లితే ఆ నష్టాన్ని ఎన్టీపీసీ (NTPC)నే భరించనున్నట్లు తెలిపింది. వాస్తవంగా ఆగస్టు 15వ తేదినే ఈ సేవలు ప్రారంభించాల్సి ఉంది. అయితే వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటివి జరగడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అయితే తొలి బస్సును సముద్రమట్టానికి 11,500 అడుగుల ఎత్తులో పరీక్షించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.