VSP: విశాఖలో పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం నాలుగుగంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, ఎంవీపీకాలనీ, బీచ్‌రోడ్డు, మధురవాడ, తదితర ప్రాంతాల్లో భూమి కంపించిందని విశాఖ వాతావరణ కేంద్రం మంగళవారం నిర్థారించింది.