భారత్లో రైలు ప్రమాదాలు (Train Accident) ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట ఇటువంటి వరుస సంఘటనలు చోటుచేసుకోవడంతో రైలు ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. తాజాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్-కేఎస్ఆర్ బెంగళూరు ఉద్యాన్ డైలీ ఎక్స్ప్రెస్ రైలు (Udyan Daily Express Train)లో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. రైలు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
వైరల్ అవుతోన్న వీడియో:
#WATCH | Bengaluru, Karnataka: Fire broke out in Udyan Express after it reached Sangolli Rayanna Railway Station. The incident happened 2 hours after passengers deboarded the train. No casualties or injuries. Fire engine and experts reached the spot and asserting the situation.… pic.twitter.com/laBLreFDgI
బెంగళూరు రైల్వే స్టేషన్ (Bangalore railway station)లో ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైలు (Udyan Daily Express Train)లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించిన సమయంలో రైలులో ప్రయాణికులెవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయణ్ణ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ఉద్యాన్ డైలీ ఎక్స్ప్రెస్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో రైలులోని B1, B2 బోగీలలో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఆగి ఉన్న రైలులో మంటలు ఎలా వ్యాపించాయో తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలేంటో తెలుసుకునేందుకు రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్లో వ్యాపించిన పొగలు మెజెస్టిక్ బస్టాండ్ లోకి స్పష్టంగా కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video viral) అవుతోంది.