ATP: గుంతకల్లులోని శ్రీశైల జగద్గురు మఠంలో సోమవారం రాత్రి వీరశైవ సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కార్తీకమాస దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉరవకొండ ఉత్తరాధికారి గవి మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరిబసవ రాజేంద్ర స్వామిజీ హాజరయ్యారు. ముందుగా ఆలయ ఆవరణంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని దీపారాధన చేశారు.