అందరిలోనూ ఏదోక టాలెంట్(Talent) అనేది దాగి ఉంటుంది. అయితే అది బయటపడటానికి కొంత సమయం పడుతుంది అంతే. సోషల్ మీడియా(Social Media) వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తమలోని టాటెంట్ ను బయటకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ టీచర్(Teacher) కూడా అద్భుతమైన స్టెప్పులు వేస్తూ డ్యాన్స్(dance) చేశారు. ప్రస్తుతం ఆ టీచర్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్(Teacher dance video Viral) అవుతోంది.
టీచర్ డ్యాన్స్ వేసిన వీడియో:
మధ్యప్రదేశ్ లోని శివపురి ప్రాంతం కరైరాలో ప్రభుత్వ టీచర్లకు ట్రైనింగ్(Teachers Training) నిర్వహిస్తున్నారు. ఈ ట్రైనింగ్ కు టీచర్లంతా హాజరయ్యారు. అందరూ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. ఓ టీచర్ తన డ్యాన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. బాలీవుడ్ సినిమా పాటకు డ్యాన్స్(Dance) వేసి రెచ్చిపోయింది.
పాటకు అనుగుణంగా ఆ టీచర్ డ్యాన్స్(Teacher Dance) వేయడం చూసి అక్కడున్నవారంతా చప్పట్లతో ఆమెను ప్రశంసించారు. బాగా డ్యాన్స్ చేస్తోందని మెచ్చుకున్నారు. దీంతో టీచర్ మరింత ఎనర్జీతో డ్యాన్స్ వేస్తూ తనలోని టాలెంట్ ను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్(Video viral) అవుతోంది. కొందరు నెటిజన్లు ఆమె డ్యాన్స్ కు ఫిదా అయ్యామని కామెంట్ చేస్తే ఇంకొంత మంది మాత్రం ఈ వయసులో అలా డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోవడం అవసరమా అంటూ కామెంట్ చేశారు.