రెంటల్ బైక్/ సైకిల్ తీసుకునే ముందు ఆలోచించండి. మీకు ఎంత అవసరం ఉంటే అంత తప్పనిసరిగా రీఛార్జీ చేయండి. రీఛార్జీ అయిపోయిన తర్వాత సైకిల్/బైక్ ఆటోమేటిక్‌గా లాక్ పడి.. ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది.
Rental Bike Abruptly Stops: ఇప్పుడు ప్రీ పెయిడ్ సైకిల్, బైక్స్ (Rental Bike) అందుబాటులోకి వచ్చాయి. ముందుగా డబ్బులు (money) చెల్లించి/ రీ ఛార్జీ చేసి వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అందులో బ్యాలెన్స్ (balance) అయిపోతే.. ఇలా ఉంటుంది. వీడియోలో (video) ఒకతని బ్యాలెన్స్ (balance) జీరోకు (zero) చేరింది. ఇంకేముంది అతను పడిపోవడంతో.. ముక్కు పగిలింది.
బైక్ (bike), సైకిల్‌కు కిలోమీటర్‌కు కొంత చొప్పున చార్జీ చేస్తుంటారు. ముందుగా అకౌంట్ రీ చార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఎంత అవసరం ఉంటే అంత రీ చార్జీ చేసుకోవాలి. లేదంటే ప్రమాదం బారిన పడతారు. వీడియోలో (video) ఒకతను సైకిల్ తీసుకొని వెళ్తున్నాడు. రోడ్డు (road) కూడా బిజీగా ఉంది. బైక్‌లో (bike) రీ ఛార్జీ అయిపోయింది. ఇంకేముంది వెళుతుండగానే ఆ సైకిల్ కిందపడిపోయింది.
Peak capitalism.
Rental Bike automatically locks as soon as the prepaid balance gets over 🤣🤣
బ్యాలెన్స్ (balance) అయిపోతే వాహనానికి ఓకేసారి లాక్ (lock) పడిపోతుంది. దీంతో సైకిల్ (cycle), బైక్ (bike) మీద ఉన్న వారు పడిపోతుంటారు. నడిపే వారికి రక్షణ లేకుండా ఇదేం పని కొందరు విమర్శిస్తున్నారు. బ్యాలెన్స్ జీరో అయితే స్పీడ్ తగ్గించాలి.. కొన్ని సెకన్ల తర్వాత ఆగిపోవాలని కోరుతున్నారు. ఓకేసారి ఆగిపోతే ఏంటీ పరిస్థితి.. వెనకాలే వచ్చే వాహనాలు ఢీ కొంటే ఎవరూ బాధ్యులు అని అడుగుతున్నారు. గబ్బర్ అనే యూజర్ వీడియో షేర్ చేశారు. పెట్టుబడిదారి మనస్తత్వానికి ఇది పరాకాష్ట. ప్రీపెయిడ్ (prepaid) బ్యాలెన్స్ అయిపోయిన వెంటనే రెంటల్ బైక్ (rental bike) ఆటోమేటిక్‌గా లాక్ అవుతుంది అని ట్వీట్ చేశారు. దీనిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.