Revanth Reddy:టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని (Revanth Reddy) పోలీసులు టెలిఫోన్ భవన్ వద్ద అడ్డుకున్నారు. తెలంగాణ నూతన సచివాలయానికి వెళ్తుండగా.. ఆపడంతో వాగ్వివాదం జిరగింది. ఓ ఎంపీగా (mp) తాను ఎప్పుడైనా తెలంగాణ సచివాలయానికి వెళ్లొచ్చు అని చెబుతున్న.. పోలీసులు (police) వెళ్లనీయలేదు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లలో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటున్నారు. ఇదే అంశంపై ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసేందుకు ఈ రోజు మధ్యాహ్నం కారులో సచివాలయానికి బయల్దేరారు. విషయం తెలిసిన పోలీసులు రేవంత్ కారును అడ్డుకున్నారు. సెక్రటేరియట్ విజిటర్స్ గేటును మూసివేయడంతోపాటు.. బారికేడ్స్ ఏర్పాటు చేశారు. సచివాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో రేవంత్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు.
పోలీసులు తన కారు ఆపడంతో డీసీపీకి (dcp) ఫోన్ చేశారు. తాను ఎంపీని అని.. తనను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. సచివాలయంలోకి అనుమతి మీ చేతుల్లో లేదని.. ప్రజా ప్రతినిధులమనే సంగతి గుర్తుంచుకోవాలని కోరారు. అడ్డుకుంటే రోడ్డు మీద కూర్చుంటానని చెప్పారు. తనకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో చెప్పాలని కోరారు.
ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారని.. సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెలుసుకునేందుకు వెళ్తున్నానని చెప్పారు. అధికారిని కలిసేందుకు వెళ్తే ఇలా అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. తన కారులో వెళ్లడం ఇబ్బంది అనిపిస్తే పోలీసులు వారి కారులో ఆ అధికారి వద్ద తీసుకెళ్లాలని రేవంత్ (Revanth) కోరారు. ఆఫీసు సమయంలోనే వెళ్తున్నానని పేర్కొన్నారు. అనుమతి ఇస్తారో ఇవ్వరో లేదో తెలుసుకుని చెబుతానని డీసీపీ చెప్పగా.. అప్పటివరకు ఇక్కడే ఉంటానని సచివాలయం సమీపంలో కారు ఆపుకొని మరీ రేవంత్ (Revanth) కూర్చున్నారు.