TSPSC Chairman and Secretary:టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ (TSPSC Paper leak) కేసులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి (janardhan reddy), కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను (anitha ramachandran) విచారించింది. వారిద్దరూ ఈడీ కార్యాలయానికి చేరుకోగా.. విచారించి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తోంది.పేపర్ లీకేజీ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఈడీ భావిస్తోంది. ఈ మేరకు విచారిస్తోంది.
పేపర్ లీక్‌కు సంబంధించి 31 లక్షలు (31 lakhs) లావాదేవీలు జరిగినట్టు సిట్ గుర్తించింది. విదేశాల నుంచి డబ్బులు వచ్చాయని ఈడీ అంటోంది. ఆ మేరకు విచారిస్తోంది. అంతకుముందు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జీ శంకరలక్ష్మీ (shankar laxmi) ఈడీ విచారణకు హాజరయ్యారు. సెక్షన్ 50 ప్రకారం వాంగ్మూలం రికార్డ్ చేశారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జీగా శంకర్ లక్ష్మీ ఉండగా.. ప్రవీణ్ (praveen), రాజశేఖర్‌కు (rajashekar) పేపర్లు ఎలా చేరాయనే వివరాలు ఈడీ ఆరా తీసింది. అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణను (satya narayana) కూడా విచారించింది.
పేపర్ లీకేజీ ఘటనలో మొత్తం రూ.31 లక్షల డబ్బులు చేతులు మారాయని సిట్ గుర్తించింది. ఇందులో రూ.7 లక్షలను నిందితుల నుంచి కమిషన్ రికవరీ చేసింది. కమిషన్‌లో పనిచేసే ప్రవీణ్ (praveen), రాజశేఖర్ (rajashekar) సహా మొత్తం 17 మంది వరకు అరెస్ట్ చేశామని హైకోర్టుకు సిట్ స్టేటస్ రిపోర్ట్ అందజేసింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు చేస్తోంది.