»A Woman Constable Who Saved The Life Of A Young Woman
Video Viral: యువతి ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్
రైల్వే అధికారులు ప్రయాణికులకు ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పు రావడం లేదు. గమ్యస్థానం త్వరగా చేరుకోవాలనే తొందరలో కదులుతున్న ట్రైన్(Running Train) ఎక్కడం చేస్తూ గాయాలపాలవుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఈ మధ్య చాలా మంది కదులుతున్న రైలు(Running Train)ను ఎక్కేందుకు ప్రయత్నించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్లాట్‌ఫామ్‌పై దూసుకెళ్తున్న ట్రైన్‌ను ఎక్కే సమయంలో పట్టుతప్పి పడిపోతున్నారు. ఆ సమయంలో కొందరికి తీవ్ర గాయాలు అవుతున్నాయి. కొంత మంది ప్రాణాలతో బయటపడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్(Hyderabad)లోని బేగంపేట రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ చాకచక్యంగా యువతిని రక్షించింది.
యువతి ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్ వీడియో:
#WATCH | Secunderabad, Telangana: An RPF (Railway Protection Force) woman constable saves the life of a woman passenger
K. Sanitha, an RPF constable saved a passenger from falling into the gap between the platform and the train, at Begumpet Railway station: RPF (31/05)
లింగపల్లి నుంచి ఫలక్‌నూమా వెళ్లే ఎక్స్‌ప్రెస్ బేగంపేట రైల్వే స్టేషన్(Begumpet Railway station)కి వచ్చి చేరుకుంది. ట్రైన్ కొద్దిసేపు ఆగి ముందుకు కదిలింది. అంతలోనే సరస్వతి అనే ప్రయాణికురాలు కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఆమె పట్టు తప్పిపోయింది. అదే టైంలో అక్కడే డ్యూటీలో ఉన్న సనిత(Sanitha) అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్(RPF Constable) ఆ మహిళను గుర్తించి రైలు కింద పడకుండా వెనక్కి లాంగింది.
ఆర్పీఎఫ్ కానిస్టేబుల్(RPF Constable) రాకుంటే మహిళా ప్రయాణికురాలు ట్రైన్ కింద పడిపోయి ఉండేదని అక్కడున్న సాక్షులు చెబుతున్నారు. రైల్వే అధికారులు ప్రయాణికులకు ఎన్నిసార్లు చెప్పినా వారిలో మార్పు రావడం లేదు. గమ్యస్థానం త్వరగా చేరుకోవాలనే తొందరలో కదులుతున్న ట్రైన్(Running Train) ఎక్కడం చేస్తూ గాయాలపాలవుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ఘటనలో ప్రయాణికురాలిని రక్షించడంపై సనితను రైల్వే అధికారులు, స్థానికులు ప్రశంసించారు. నల్లగొండ జిల్లాకు చెందిన సనిత(Sanitha) 2020లో ఆర్పీఎఫ్ (RPF)లో జాయిన్ అయ్యి ఇప్పుడు బేగంపేట్ రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది.