ys sharmila:కవిత.. మహిళా రిజర్వేషన్లు ఇప్పుడే గుర్తొచ్చాయా? షర్మిల విసుర్లు
ys sharmila:బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళ రిజర్వేషన్లు అని కొత్త పాట పాడటం వెనక ఉన్న కారణం ఏంటో అందరికీ తెలుసున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కొత్త వాదన ఎంచుకున్నారని ఫైరయ్యారు. ఇన్నాళ్లు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశం గుర్తురాలేదా అని అడిగారు.
ys sharmila:బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళ రిజర్వేషన్లు అని కొత్త పాట పాడటం వెనక ఉన్న కారణం ఏంటో అందరికీ తెలుసున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కొత్త వాదన ఎంచుకున్నారని ఫైరయ్యారు. ఇన్నాళ్లు మహిళలకు 33 శాతం (33 percent) రిజర్వేషన్ల అంశం గుర్తురాలేదా అని అడిగారు. రెండు సార్లు అధికారం చేపట్టి మహిళలకు 33 శాతం సీట్లు ఎందుకు కేటాయించలేదని షర్మిల (ys sharmila) అడిగారు. 2014 ఎన్నికల్లో మహిళలకు ఇచ్చింది 6 సీట్లు అంటే 5.88 శాతం అని గుర్తుచేశారు. 2018లో మహిళలకు 4 సీట్లు.. అంటే 3.36 శాతం కేటాయించారని.. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం అని షర్మిల అడిగారు.
శాసనమండలిలో 34 మంది (34 members) సభ్యుల ఉంటే మహిళలకు ఇచ్చింది మూడు సీట్లేనని షర్మిల (ys sharmila) వివరించారు. 8.82 శాతం మాత్రమే అవకాశం ఇచ్చారని తెలిపారు. మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి? ఇదేనా అడిగారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే మహిళలకు రెండు సీట్లు.. అంటే 11.76 శాతం మాత్రమే కేటాయించారని తెలిపారు. ఇదేనా మహిళలపై (women) మీకున్న ప్రేమ అని అడిగారు. తెలంగాణ తొలి క్యాబినెట్లో మహిళలకు చోటు లేదన్నారు. ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో ఇద్దరు మంత్రులు (two) మాత్రమే ఉన్నారని తెలిపారు.
మహిళ రిజర్వేషన్లు అమలు చేయడంలో కేసీఆర్‌కు (kcr) వచ్చిన ఇబ్బంది ఏమిటని అడిగారు. కవిత (kavitha) మీరు దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్ (pragathi bhavan) ముందు.. ఫామ్ హౌజ్ (farm house) ముందు అని ఆమె సూచించారు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ (liquor scam) చేసిన మీరు, మహిళలకే తలవంపు తెచ్చారని షర్మిల విమర్శించారు. ఇప్పుడు ఆ స్కామ్‌ను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. ఈ విషయాలు అన్ని జనాలకు తెలుసు అని చెప్పారు. ఏం చేసినా, ఏం చెప్పినా గమనిస్తున్నారని తెలిపారు.
లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి బిడ్డ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కొత్తరాగం అందుకోవడం విడ్డూరం. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్టుంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు, మహిళలకు 33% సీట్లు ఎందుకు కేటాయించలేదు? 2014 ఎన్నికల్లో 1/4