»Ys Sharmila Asked Governer Establish President Rule In Telagnana State
ys sharmila:తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి.. పవన్‌ను పరామర్శించిన షర్మిల
ys sharmila:యూత్ కాంగ్రెస్ వరంగల్ అధ్యక్షుడు పవన్‌ను (pawan) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) పరామర్శించారు. ఇటీవల BRS కార్యకర్తల దాడిలో గాయపడ్డ సంగతి తెలిసిందే. వైద్యులతో మాట్లాడి పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి షర్మిల (ys sharmila) తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన (president rule) విధించాల్సిన అవసరం ఉందని షర్మిల అన్నారు.
ys sharmila:యూత్ కాంగ్రెస్ వరంగల్ అధ్యక్షుడు పవన్‌ను (pawan) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) పరామర్శించారు. ఇటీవల BRS కార్యకర్తల దాడిలో గాయపడ్డ సంగతి తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం అతనిని సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులతో మాట్లాడి పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి షర్మిల (ys sharmila) తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన (president rule) విధించాల్సిన అవసరం ఉందని షర్మిల అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం కేసీఆర్ (cm kcr) నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గవర్నర్‌ను కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరతాం అని తెలిపారు. ఇక్కడ రౌడీల రాజ్యం నడుస్తుందని షర్మిల ధ్వజమెత్తారు. పోలీసులు BRS ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడుల చేస్తారా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నేతల తీరు సరిగా లేదని షర్మిల (ys sharmila) అన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? రాడ్లు పట్టుకొని మొహం పగల గొడతార..? అని అడిగారు. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు గూండాలా? మనుషులా? లేదంటే మృగాలా..? అని అడిగారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు (law and order) అదుపులో లేవన్నారు. ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడటం నేరమా.? అని అడిగారు. అలా చేస్తే ఇంత ఘోరంగా దాడులు చేస్తారా..? అన్నారు. బీఆర్ఎస్ (brs) గుండాల చేతిలో గాయపడ్డ పవన్ కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుందని వైద్యులు (doctors) చెప్పారు. వారికి పవన్ తల్లి శాపం తగులుతుందన్నారు.
తన పాదయాత్ర దాడులు చేశారని గుర్తుచేశారు. హుజూర్ నగర్ (huzur nagar), ధర్మపురిలో (dharmapuri) దాడి చేశారని తెలిపారు. నర్సంపేట (narsampeta), మహబూబాబాద్‌లో (mahabubabad) దాడి చేసి పాదయాత్ర ఆపారని పేర్కొన్నారు. రాళ్లతో కొడుతున్నారు.. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారని షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా? అనే సందేహాం కలుగుతుందన్నారు. నడి రోడ్డు మీద హత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఇది మంచి పద్దతి కాదని.. తీరు మార్చుకోవాలని సూచించారు.