»We Will Come To Power Not Only In Karnataka But Also In Telangana With Full Majority Amit Shah
Amit Shah : కర్ణాటకలోనే కాదు.. తెలంగాణలోనూ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తాం : అమిత్ షా
తెలంగాణలో సైతం పూర్తి మెజర్టీతో గెలుస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని చెప్పారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ (Karnataka Assembly) ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. అమిత్‌షా కూడా ప్రచారన్ని నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో ఓ వార్తా ఛానల్ తో మాట్లాడుతూ, కర్ణాటకలో బీజేపీ (BJP) మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం(Double Engine Govt) పై కర్ణాటక ప్రజలకు నమ్మకం ఉందని అమిత్‌షా తెలిపారు. తెలంగాణ(Telangana)లో సైతం పూర్తి మెజర్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని చెప్పారు.
మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు కర్ణాటకలో ప్రచారాన్ని ముగించుకుని రేపు సాయంత్రం అమిత్ షా హైదరాబాద్ (Hyderabad) కు రానున్నారు. తన పర్యటన సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా(‘RRR’ movie) బృందంలోని ప్రముఖులతో ఆయన భేటీ అవుతారు. చేవెళ్ల(Chevella)లో నిర్వహించే సభలో పాల్గొంటారు. గత ఏడాది తన పర్యటనల సందర్భంగా నటులు జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), నితిన్‌లను మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్ ఆయన కలిశారు. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే.. తెలంగాణపై బీజేపీ మరింతగా దృష్టి సారిస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.