»Police Constable Final Written Exam On 30th April Hall Tickets From Ellundi
TSLPRB : ఏప్రిల్ 30న పోలీసు కానిస్టేబుల్ తుది రాతపరీక్షలు…ఎల్లుండి నుంచి హాల్టికెట్లు
కానిస్టేబుల్ (Constable) ఉద్యోగ పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తుది పరీక్షలను తేదీలను వెల్లడిస్తూ రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటన విడుదల చేసింది
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ (Constable) తుది రాత పరీక్షలను ఏప్రిల్ 30న నిర్వహించనున్నట్లు TSLPRB తెలిపింది. సివిల్ ఉద్యోగాలకు ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల( Police Jobs ) భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ల(Hall tickets)ను ఏప్రిల్ 24 తేదీ ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు సంబంధిత వెబ్సైట్ (Website) నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
హాల్టికెట్ డౌన్లోడ్ చేసేప్పుడు ఏదైనా సమస్య తలెత్తినట్లయితే support@tslprb.in కు మెయిల్ లేదా 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవచ్చని TSLPRB వెల్లడించింది. మరోవైపు ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే నెల మొత్తం ఎస్సై, కానిస్టేబుల్ తుది పరీక్ష మూల్యాంకన జరగనుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరీక్షల తుది ఫలితాలు ఒక కొలిక్కి వచ్చాక ఎంపికైన అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను జూన్లో పరిశీలించనున్నారు. జిల్లా కేంద్రాల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలకు తగిన ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన, అభ్యర్థుల నేర చరిత్రపై ఆరా.. ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే అభ్యర్థుల తుది జాబితా వెలువడనున్నట్లు తెలుస్తోంది.