విఘ్నాలను నివారించే గణపతి జన్మదినమే వినాయకచవితి (Vinayaka chavithi). ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షమి చవితి రోజున వినాయక చవితి పండుగను నిర్వహిస్తారు. ఆదిదంపతుల ప్రథమ కుమారుడైన గణపతి(Ganapati)ని పూజించనిదే ఏ పనిని ప్రారంభించరు. వినాయకుని అనుగ్రహం ఉంటే అన్ని శుభలే లభిస్తాయి. ఈ చవితి నాడు ఉత్సవాల్లో పెద్దలతో పాటు పిల్లలు కూడా సంతోషంగా పాల్గొంటారు. హిందువుల పండుగల్లో వినాయక చవితికి ఉన్న ప్రత్యేకతే వేరు. పిల్ల, పెద్ద పేద, ధనిక అనే ఎటువంటి బేధం లేకుండా అందరు కలసి ఊరూవాడా (Uruwada)సంబరంగా పండుగ జరుపుకుంటారు. చిన్న చిన్న ప్రతిమల నుంచి భారీ విగ్రహాల వరుకూ ఎవరి ఎవరి స్థోమతకు తగిన విధంగా వారికి అందుబాటులో ఉంటాడు గణపయ్య.విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో పూజిస్తారు. వాస్తవానికి వినాయకుడికి 32 రూపాలున్నాయని చెబుతారు కానీ వీటిలో ఈ 16 అత్యంత ప్రముఖమైనవంటారు.
సర్వ విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి పుట్టినరోజు.. వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాలు కొనసాగే నవరాత్రుల పాటు.. ఊరూవాడా భక్తిభావం(Devotion)తో పులకించిపోతాయి. అందంగా అలంకరించిన మండపాలు మిరుమిట్లు గొలుపుతుంటే.. ఠీవీగా ఆసీనుడైన గణపయ్య భక్తులను కటాక్షిస్తుంటాడు. వీధుల్లోని విగ్రహాలతోపాటు.. ప్రతిఇంటా వినాయక ప్రతిమలను ఉంచి విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో గణపతి నవరాత్రులు (Navaratrulu) నిర్వహిస్తుంటారు. ప్రతి ఇంట్లో వినాయకుడి బొమ్మను వివిధ రకాల పువ్వులు(Flowers), పత్రితో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తుంటారు. వినాయకుని నవరాత్రుల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.
భారతీయ సంప్రదాయంలో అన్ని వర్గాలలో జరుపుకునే పండుగల్లో వినాయక చవితి అగ్రస్థానం. గత కొన్ని సంవత్సరాలుగా వినాయక విగ్రహాల తయారుచేయడానికి పర్యావరణ (environmental) పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. మట్టితో గణపతి విగ్రహాల తయారీతో పాటు పర్యావరణ హితమైన రంగులను వాడుతుంటారు. దీంతో పలు తటాకాలు, నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటాయి. గణపతి బప్పా (Ganapati Bappa) మోరియా’, ‘జై బోలో గణేష్ మహరాజ్‌కి’ నినాదాలతో ఊరు వారా హోరెత్తుతాయి. ఏ పని ప్రారంభించాలన్నా.. ఏ పూజ మొదలుపెట్టాలన్నా.. ముందుగా వినాయకుడినే పూజిస్తారు. అంతేకాకుండా మన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు కూడా బాగుండాలని కోరుకుంటారు.