»Good News For 6th To 9th Class Students Post Office Is Giving Scholarship
Postal scholarship: 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు శుభవార్త..‘తపాలాశాఖ’ ఇస్తోన్న స్కాలర్షిప్!
పోస్టల్ శాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏటా రూ.6 వేలు అందించే స్కాలర్షిప్ కోసం పరీక్షల సమాచారం గురించి తెలియజేసింది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కీమ్ కింద స్కాలర్ షిప్ అందించనున్నట్లు వెల్లడించింది.
ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు తపాలాశాఖ శుభవార్త చెప్పింది. దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ ఇవ్వడానికి తపాలాశాఖ పోటీ పరీక్షలను నిర్వహించనుంది. విద్యార్థులలో హిస్టరీ, స్పోర్ట్స్, మరికొన్ని అంశాలపై ఈ పోటీ పరీక్షలను నిర్వహిస్తోంది. తపాలా బిళ్లల సేకరణ, వాటి అధ్యయనం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు ప్రతి ఏటీ ఈ పోటీలను తపాలా శాఖ నిర్వహిస్తోంది. ఈ పోటీలో ఎంపికైన వారికి ప్రతి ఏటా రూ.6 వేల స్కాలర్షిప్ అందనుంది.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తొమ్మదో తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు. ఈ పరీక్ష రాసేందుకు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాల హెచ్ఎం పేరుపై దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దగ్గరల్లోని రీజనల్ ఆఫీస్కు ఆ దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి రూ.200లు చెల్లించాల్సి ఉంటుంది. ఏయే తేదీల్లో పరీక్షలు ఉంటాయనే విషయాన్ని తపాలా అదికారులు పాఠశాల హెచ్ఎంలకు వివరిస్తారు.
ఈ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను విజయవాడ, హైదరాబాద్లోని తపాలాశాఖ సర్కిల్ కార్యాలయ అధికారులు ఎంపిక చేయనున్నారు. ఒక్కో తరగతి నుంచి 10 మంది మాత్రమే ఎంపికవుతారు. ఎంపికైన వారికి ప్రతి నెలా రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేల స్కాలర్షిప్ అందుతుంది. మరింత సమాచారం కోసం దగ్గర్లోని తపాలా కార్యాలయానికి వెళితే అన్ని విషయాలను వివరిస్తారు.