»Tsrtc Sajjanar Said That A Fine Of Rs 500 Will Be Levied If Zero Ticket Is Not Taken
TSRTC: జీరో టికెట్ తీసుకోకపోతే రూ.500 జరిమాన
మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి కొన్ని స్పష్టమైన నిబంధనలు పెట్టింది టీఎస్ఆర్టీసీ. చాలా మంది నియమాలను పాటించడం లేదని, ఇలా చేస్తే ఫైన్ కట్టాల్సివస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
TSRTC: Sajjanar said that a fine of Rs.500 will be levied if zero ticket is not taken
TSRTC: తెలంగాణ(Telangana) రాష్ట్రప్రభుత్వం మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కలిపించింది. దీంతో ఆర్టీసీ బస్సులు కళకళలాడుతున్నాయి. ఈ ప్రయాణం కోసం ఆర్టీసీ కొన్ని నియమాలు పెట్టింది. ఉచిత ప్రయాణం చేసే ప్రతీ మహిళ ఒరిజినల్ ఐడీ కార్డును చూపించాలని తెలిపింది. ఈ పథకం అమలులోకి వచ్చి దాదాపు నెల రోజులు అవుతున్నా చాలా మంది మహిళలు ఇంకా తమ ఐడీలను మైబైల్ల్లోనూ, జిరాక్స్‌గా చూపిస్తున్నారు. అలాగే పాన్ కార్డులను కూడా ఐడీలుగా చూపిస్తున్నారు. ఇకపై కచ్చితంగా ఒరిజినల్ ఐడీ కార్డు ఉండాల్సిందే అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఫోటో, అడ్రెస్ ఉన్న ఆధార్ కార్డు, లేదా ఓటర్ ఐడీ ఉండాల్సిందే అన్నారు.
ఈ పథకం కేవలం తెలంగాణలోని మహిళలకే కాబట్టి మిగితా రాష్ట్రాల మహిళలు కచ్చింతగా టికెట్ తీసుకోవాలని కోరారు. అలాగే ఒరిజినల్ ఐడీ కార్డు చూపించనట్టైతే కచ్చితంగా టికెట్ తీసుకోవాలని వెల్లడించారు. అలాగే ఉచిత ప్రయాణం కోసం ఇచ్చే జీరో టికెట్‌ను తీసుకోవడం లేదని, ఇలా చేయడం చట్టరిత్య నేరం అని చెప్పారు. ఎలాగో ప్రయాణం ఉచితమే కదా, మళ్లీ టికెట్ ఎందుకు అంటున్నారని, ఆ టికెట్ ద్వారానే ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఒక వేళ ఉచిత ప్రయాణం చేసే వారి దగ్గర జీరో టికెట్ లేకుండా చెకింగ్‌లో దొరికిితే రూ. 500 జరిమాన విధించే అవకాశం ఉందని సజ్జనార్ తెలిపారు.