»The Thief Who Came To Steal And Killed The Old Woman
Suryapet:దొంగతనానికి వచ్చి వృద్ధురాలిపై అత్యాచారం, హత్య.. ఆపై సెల్ఫీ తీసుకుని
వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎవరికైనా చెబుతుందేమో అని ఆమెను హతమార్చాడు. అంతటితో అతని పైశాచిక ఆనందం తీరలేదు. చనిపోయిన వృద్ధురాలితో సెల్ఫీవీడియో(selfi) తీసుకుని తనలోని క్రూరత్వాన్ని బయట పెట్టుకున్నాడు.
Suryapet: సూర్యాపేట జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. దొంగతనానికి వచ్చిన దొంగ(Thief) వృద్ధురాలిపై కిరాతకంగా అత్యాచారం చేసి తర్వాత ఆమెను హతమార్చాడు. ఓ యువకుడు ఆత్మకూరు మండలం ఇస్తాళపురంలో డబ్బుల కోసం ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎవరికైనా చెబుతుందేమో అని ఆమెను హతమార్చాడు. అంతటితో అతని పైశాచిక ఆనందం తీరలేదు. చనిపోయిన వృద్ధురాలితో సెల్ఫీవీడియో(selfi) తీసుకుని తనలోని క్రూరత్వాన్ని బయట పెట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ విలేకరులకు సోమవారం వివరించారు…కప్పల విజయ్ (25) ఇస్తాళపురం గ్రామానికే చెందిన యువకుడు. అతను సూర్యాపేటలో ఉన్న ఓ మద్య దుకాణంలో పనిచేస్తున్నాడు. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇంట్లో దొంగతనం చేయాలని విజయ్(Vijay) పథకం వేశాడు. దీనికోసం ఖాలేందర్ అనే స్నేహితుడితో కలిసి ఏప్రిల్ 8న ఆమె ఇంటికి వెళ్లారు. తాను ఇంట్లోకి వెళ్లి ఖాలేందర్ ను బయట కాపలా ఉండమన్నాడు.
ఆ తర్వాత విజయ్ లోపలికి వెళ్లడం వెళ్ళడంతోనే అరాచకం మొదలుపెట్టాడు. కాళ్లతో తలుపులను తన్ని ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఎదురొచ్చిన వృద్ధురాలి ముఖంపై పిడుగులు గుద్దాడు. ఈ దాడికి తట్టుకోలేక ఆమె స్పృహ తప్పింది. వెంటనే ఆమె నోట్లో బట్టలు కుక్కాడు. ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదంతా తన ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. నోట్లో గుడ్డలకు కుక్కడం, అత్యాచారంతో ఊపిరి ఆడక వృద్ధురాలు మృతి చెందింది. ఆమె చనిపోయినది పట్టించుకోకుండా విజయ్ ఇంట్లో ఉన్న ఆరు తులాల బంగారు నగలు(gold Ornaments), రూ.5 వేలు తీసుకుని బయటకు వచ్చేసాడు. డబ్బులు తెల్లారి ఇస్తానని చెప్పి ఖాలేందర్ను అక్కడి నుంచి పంపించాడు. ఆ తర్వాత 9వతేదీ సూర్యాపేటలో దొంగిలించిన నగలను తాకట్టు పెట్టి… రూ.1.90వేలు తీసుకున్నాడు. ఈ డబ్బులో రూ.48వేలతో పల్సర్ బైక్ కొన్నాడు. రూ.10000 పెట్టి కొత్త బట్టలు కొనుక్కున్నాడు. తన స్నేహితులతో మందు పార్టీ(Party)కి రూ.7వేలు పెట్టి మందు కొన్నాడు. హత్య విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆరోజు నిందితులిద్దరూ ఊర్లో ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు.. పదవ తేదీన వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.