తెలంగాణ హరితహారం (Harithaharam) తొమ్మిదో విడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ (CMKCR) ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు(Tummalur) అర్బన్ ఫారెస్ట్‌లో మొక్కను నాటి హరితహారానికి సీఎం శ్రీకారం చుట్టారు. పుడమి తల్లికి వెలకట్టలేని అభరణం హరితహారం అని సీఎం అన్నారు. రాష్ట్రంలో 7.7% పచ్చదనం పెరిగిందన్నారు. గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి. 85% ప్రాజెక్టులు పూర్తయ్యాయి మొదట్లో హరిత హారం అంటే జోకులు వేశారని సీఎం అన్నారు. చేవెళ్ల (Chevella) ప్రాంతానికి రాబోయే కొద్ది రోజుల్లోనే నీళ్లు అందిస్తామని ఆయన తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు (Palamuru Project) పూర్తి కాకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుపడ్డారని లేదంటే ఇప్పటికే ప్రాజెక్టు పూర్తయ్యేది అని సీఎం తెలిపారు.
ఫొటో ఎగ్జిబిషన్(Photo Exhibition)ను, అటవీ అధికారుల సామాగ్రిని తిలకించారు. రాష్ట్ర వ్యాప్తంగా 19.29 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. తాను నమ్మిన ప్రకృతి పునరుజ్జీవనాన్ని తెలంగాణ (Telangana) సమాజంలోని ప్రతి ఒక్కరి మదికి ఎకేలా చేయటంలో సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఆయన కృషి, పట్టుదల ఫలితాలే దశాబ్ది తెలంగాణలో మన కండ్ల ముందు కనిపిస్తున్న సతతం హరితం.. తెలంగాణం. ఎమిదేండ్లలో నాటిన 273.33 కోట్ల మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్(Oxygen)తోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచింది. ఇందుకు ప్రభుత్వం రూ.10,822 కోట్లు ఖర్చుచేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy), ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రాచకొండ సీపీ చౌహాన్, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.