మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి (Kadap MP Avinash Reddy) సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి(Kadap MP Avinash Reddy) కి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాశ్‌తో పాటు సీబీఐకి (CBI) కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది. అవినాశ్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు(Telangana High Court) అవినాశ్‌కు ముందస్తు బెయిల్ మంజురు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు సుప్రీంలో సునీత పిటిషన్‌పై విచారణ జరిగింది. ఆమె తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూథ్రా (Sr. Council Siddharth Luthra)వాదనలు వినిపించారు.
ఈ క్రమంలో అవినాశ్ రెడ్డితో పాటు సీబీఐకి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. జులై 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ (DY Chandrachud) ధర్మాసనం ముందు కేసును విచారించాలని సుప్రీం ధర్మాసనం పెర్కోన్నాది. అయితే సీనియర్ న్యాయవాదులు వాదించడానికి ధర్మాసనం అనుమతించలేదు. దాంతో సునీతారెడ్డే (Sunita Reddy) స్వయంగా వాదనలు వినిపించారు. ఆమెకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా(Siddhartha Luthra) సహకరించడానికి ధర్మాసనం అనుమతించింది. తన తండ్రి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి దర్యాప్తుకు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు సునీత తెలిపారు. దర్యాప్తును పూర్తి చేయడానికి సీబీఐ కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరుతోందని, ముందస్తు బెయిల్ రావడంతో ఆయన్ను సీబీఐ కస్టడీలో విచారించలేకపోతోందని అన్నారు.