Ashwin: డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిని ఫ్యాన్స్ ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోవడం లేదు. ఆ మ్యాచ్‌లో స్పిన్సర్ రవిచంద్రన్ ఆశ్విన్‌ను (Ashwin) తుది జట్టులోకి తీసుకోలేదు. అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆశ్విన్‌ను పక్కన పెట్టాడు. దీనిపై టీమిండియా సీనియర్లు, సచిన్ టెండూల్కర్ కూడా తప్పుపట్టారు. ఇన్నాళ్లకు ఆశ్విన్ (Ashwin) ఇదే అంశంపై మాట్లాడారు.
‘తాను బౌలర్ కాకుండా ఉండాల్సింది.. బౌలర్లకు, బ్యాటర్లకు వేర్వేరు కొలమానాలు ఉంటాయి. వేర్వేరుగా చూస్తారు. ఒకప్పుడు జట్టులో కొలీగ్స్ అంతా కలిసి ఉండేవారు. ఇప్పుడు మాత్రం సహచరులగానే ఉంటున్నారు. ఇదీ సహోదోగ్గులుగా ఉండే కాలం.. ఈ రెండింటీ మధ్య చాలా తేడా ఉంది. అందరి ధ్యాస ముందుకెళ్లడం మీదే ఉంది. పక్కన ఉన్న వారి గురించి పట్టించుకోవడం లేదు. ఏం చేస్తున్నారని అడిగే తీరిక ఉండటం లేదు. ఒకరి అభిప్రాయాలను పంచుకునే కొద్దీ ఆట మెరుగుపడుతుందని విశ్వసిస్తా.. మరో ఆటగాడి టెక్నిక్, ప్రయాణాన్ని అర్థం చేసుకుంటే ఆట మెరుగు అవుతుంది. ఇప్పుడు అలా జరగడం లేదు. నీ సాయం కోసం ఎవరూ రారు. వారి ప్రయాణం వారిదేనని’ ఓ ఇంటర్వ్యూలో ఆశ్విన్ (Ashwin) అభిప్రాయపడ్డారు.
నిజానికి ఈ సారి డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు చేరడంలో ఆశ్విన్ (Ashwin) కీ రోల్ పోషించారు. చివరికీ ఫైనల్ మ్యాచ్‌లోనే అతడిని తీసుకోలేదు. ఆశ్విన్ స్టాండ్స్‌కు పరిమితం కాగా.. ఎక్స్ ట్రా పేసర్‌ను తుది జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసి.. ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది.