»Prabhas Did A Lot For Friends And Also Too Much Support
Prabhas: ఇది ప్రభాస్ అంటే..ఫ్రెండ్స్ కోసం చాలా చేశాడు!
బాహుబలి2లో 'వీడెక్కడున్న రాజేరా' అని చెప్పిన డైలాగ్ ప్రభాస్(Prabhas)కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈ విషయంలో రెబల్ స్టార్ అభిమానులు కాలర్ ఎగరెస్తుంటారు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఫ్యాన్స్ విషయంలో ప్రభాస్ కేరింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక అంతకుమించి అన్నట్టు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను చూస్తుంటాడు డార్లింగ్.. తాజాగా మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్(Prabhas) పెదనాన్న మరణించినప్పుడు.. కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులందరికీ భోజనం పెట్టి మరీ పంపించాడు ప్రభాస్. అంత బాధలోను ప్రభాస్.. తన ఫ్యాన్స్ గురించి ఆలోచించడం అప్పట్లో సెన్సేషన్‌గా నిలిచింది. ఆ తర్వాత కృష్ణంరాజు స్వస్థలం మొగల్తూరులో భారీ సంస్మరణ సభ నిర్వహించి..లక్ష మందికి పైగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక ఫ్యాన్స్ విషయం ఇలా ఉంటే.. హీరోయిన్లు, కో స్టార్స్ కోసం క్యారెజీలకు క్యారెజీల భోజనం సెట్స్‌కు తెప్పిస్తుంటాడు ప్రభాస్. ఇదే విషయాన్ని ప్రభాస్‌తో నటించిన ప్రతీ ఒక్కరు చెబుతుంటారు.
ఇక ప్రభాస్ ఫ్రెండ్స్ అయితే ఆయన వెన్నంటే ఉంటారు. వాళ్లను ఏదో ఓ ఫీల్డ్‌లో సెట్ చేశాడు. కొందరిని నిర్మాణ రంగంలోకి కూడా తీసుకొచ్చాడు. ప్రభాస్ ఫ్రెండ్స్(friends) అయినటువంటి ప్రమోద్, వంశీలను ‘మిర్చి’ సినిమాతో నిర్మాతలుగా మార్చి.. యువి క్రియేషన్స్ బ్యానర్‌ను స్థాపించాడు. అప్పటి నుంచి టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్‌గా ఉంది యూవీ క్రియేషన్స్. కానీ సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అవడంతో భారీ నష్టాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు యూవీ క్రియేషన్స్‌కు ప్రభాస్ భారీ లాభాలను ఇచ్చినట్టు తెలుస్తోంది.
జూన్ 16న ప్రభాస్ నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల(telugu states) థియేట్రికల్ రైట్స్‌ను యూవీ క్రియేషన్స్ దక్కించుకుంది. కానీ రీసెంట్గా ఆ రైట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్లిపోయాయి. పీపుల్స్ వారు ఏకంగా రూ.170 కోట్ల వరకు చెల్లించారు. అయితే ఈ రైట్స్‌ను యూవీ సంస్థ నుంచి తీసుకున్నారు పీపుల్స్ వారు. గతంలోనే యూవీ క్రియేషన్స్‌కు తక్కువ రేటుకు.. అంటే వంద కోట్లకు అటు ఇటుగా ఆదిపురుష్ మేకర్స్ నుంచి తెలుగు రైట్స్ దక్కేలా చేశాడు ప్రభాస్.
కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో యూవీ క్రియేషన్స్ కోసం డబుల్ రేటు పెట్టించాడు ప్రభాస్. ఈ డీల్(deal)తో రూ.70 నుంచి రూ.80 కోట్లకు పైగా యువీ క్రియేషన్స్ లాభం వచ్చినట్టు సమాచారం. అలాగే ‘స్పిరిట్’లో ఉన్న యువీ డీల్‌ను కూడా పీపుల్స్ మీడియా వాళ్లకే ఇప్పించాడు. మొత్తంగా ఈ రెండు డీల్స్‌తో ఫ్రెండ్స్‌కు భారీ లాభాలను ఇచ్చాడు ప్రభాస్. దాంతో దిల్ రాజుకు ఇవ్వాల్సిన రూ.40 కోట్లతో పాటు.. మొత్తం అప్పులన్నీ క్లియర్ చేసి యువి వాళ్లు సేఫ్ జోన్లోకి వచ్చేశారని అంటున్నారు. దీనంతటికి కారణం ప్రభాసే కాబట్టి.. డార్లింగ్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడని అంటున్నారు. ఏదేమైనా.. ఇలాంటి విషయాల్లో ప్రభాస్ గ్రేట్ అనే చెప్పాలి.