»Choreographer Chaitanya Suicide Is Not Financial Matter Friends
Chaitanya ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణం కాదట?
కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్యకు కారణం ఆర్థిక ఇబ్బందులు కాదని.. ఢీ టైటిల్ కొట్టలేదని, ఈసారి ఎలిమినేట్ అయ్యాననే విషయం బాధించి ఉంటుందని స్నేహితులు చెబుతున్నారు.
Choreographer Chaitanya Suicide is not financial matter: friends
Chaitanya:ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకుంటున్నానని ఢీ కొరియోగ్రాఫర్ చైతన్య (Chaitanya) సెల్ఫీ వీడియోలో చెప్పిన సంగతి తెలిసిందే. అతని మృతితో బుల్లితెర విషాదం నెలకొంది. చైతన్య స్వస్థలం నెల్లూరులో విషాద చాయలు అలుముకున్నాయి. చైతన్య (Chaitanya) మృతిపై స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అతను చనిపోలేదని చెబుతున్నారు. అలా అయితే ఐదేళ్ల క్రితమే చనిపోవాలని అంటున్నారు. నిజంగా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది ఉంటే తాము సాయం చేసేవారం అని చెబుతున్నారు. తమకు పదేళ్ల నుంచి పరిచయం ఉందని.. ఎప్పుడూ మంచిగా నవ్వుతూ మాట్లాడేవాడు అని గుర్తుచేశారు.
2 రోజుల క్రితం కూడా మాట్లాడానని మరో స్నేహితుడు చెప్పాడు. చైతన్యకు (Chaitanya) ఢీ షోలో కొరియా గ్రాఫర్ కావాలి.. అంతకుమించి ఏమీ లేదన్నారు. టైటిల్ కొట్టాలి.. అదే గోల్ తప్ప మరో ధ్యాస లేదన్నారు. ఢీ టైటిల్ కొట్టలేదని.. అలాగే ఈ సారి కూడా ఎలిమినేట్ అయ్యాడని చెబుతున్నారు. అదే చైతన్యను బాధించి ఉంటుందని తెలిపారు. తమకు చైతన్య (Chaitanya) చెప్పేవాడని.. పైకి ఎదిగేందుకు కష్టపడాలని చెప్పేవారని తెలిపారు. ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించలేమని చెబుతున్నారు.
చైతన్య (Chaitanya) పేరంట్స్కు ఏమీ ఇవ్వలేదని.. వారు కూడా అతనికి డబ్బులు సాయం చేసే పరిస్థితి లేదని బంధువులు చెబుతున్నారు. ఈవెంట్స్ చేసి వెళ్లదీశాడని.. వైజాగ్, కావాలి వచ్చిన సమయంలో ఫోన్ చేశాడని బంధువు ఒకరు తెలిపారు. పేరు వచ్చిందని అందరం సంబర పడ్డామని తెలిపారు. జీవితంలో పైకి ఎదుగుతున్నాడని.. ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేమని చెప్పారు. అతను ఎప్పుడూ తన చుట్టు ఉండేవారు బాగుండాలని కోరుకునే వారని తెలిపారు. బాయ్స్ భోజనం పెట్టాలని.. చక్కగా చూసుకోవాలని అనేవాడని పేర్కొన్నారు.
డబ్బుల వల్లే చనిపోతున్నా అని చెప్పడం కరెక్ట్ కాదని అంటున్నారు. అలా అయితే అందరం సాయం చేసేవాళ్లం అంటున్నారు. చైతన్య ఉరేసుకుంటానని చెబితే తాను వచ్చేదానినని ఓ మహిళ కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. ఢీ షో టైటిల్ కొట్టలేదని.. ఈ సారి ఎలిమినెట్ అయ్యాననే అంశం చైతన్యను తీవ్రంగా కలచివేసిందని స్నేహితులు చెబుతున్నారు.