»The Government Announced Summer Vacations For Schools
Summer holidays : స్కూళ్లుకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణలోని (Telangana) ప్రభుత్వం, ప్రవేట్ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరుకు ప్రభుత్వం వేసవి సెలవులు (summer holidays) ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం అవుతుందని విద్యాశాఖ(Department of Education) తెలిపింది. అయితే ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు SA – II ఎగ్జామ్స్ ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
తెలంగాణలోని (Telangana) ప్రభుత్వం, ప్రవేట్ స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరుకు ప్రభుత్వం వేసవి సెలవులు (summer holidays) విద్యాశాఖ ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం అవుతుందని విద్యాశాఖ(Department of Education) తెలిపింది. అయితే ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు SA – II ఎగ్జామ్స్ ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఆరు నుంచి ఎనిమిది తరగతులకు 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మ. 12:30 గంటల వరకు SA – II ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఇక 21 నుంచి 24వ తేదీ వరకు పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. 25వ తేదీన పేరెంట్ టీచర్ మీటింగ్ (Parent teacher meeting) నిర్వహించి, విద్యార్థుల మార్కులను తల్లిదండ్రులకు తెలిపి, వేసవి సెలవులు (Summer holidays) ప్రకటించనున్నారు.