»Telangana Cm Kcr Inaugurated Viprahitha Brahmana Samkshema Sadan At Gopanpally
CM KCR గుడ్ న్యూస్.. విప్రహిత ప్రారంభోత్సవ వేళ బ్రాహ్మణులపై వరాల జల్లు
బ్రాహ్మణ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సదనం ప్రారంభించుకున్న శుభ సందర్భంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలు మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నా.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా బ్రహ్మణుల (Brahmins) కోసం ప్రత్యేక భవన సముదాయం తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) నిర్మించింది. హైదరాబాద్ (Hyderabad) శివారు గోపన్ పల్లి (Gopanpally) గ్రామంలో 6 ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రహ్మణ సదనం (Viprahitha Brahmana Samkshema Sadan) భవనాన్ని సీఎం కేసీఆర్ (KCR) ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బ్రహ్మణులపై వరాల జల్లు కురిపించారు. పెద్ద ఎత్తున వారి సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
వేదమంత్రోచ్ఛరణాల మధ్య దేశంలోని వివిధ పీఠాధిపతులు, బ్రాహ్మణ పెద్దల సమక్షంలో సీఎం కేసీఆర్ భవనాన్ని ప్రారంభించారు. అంతకుముందు యాగం, పూజ క్రతువులో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో (Meeting) సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని రూ.12 కోట్లతో నిర్మించాం. బ్రాహ్మణ సదన్ ను నిర్మించడం దేశంలోనే తొలిసారి. వేదశాస్త్ర విజ్ణాన భాండాగారంగా బ్రాహ్మణ సదన్ విలసిల్లాలి’ అని ఆకాంక్షించారు.
‘బ్రాహ్మణ సంక్షేమానికి (Welfare) తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సదనం ప్రారంభించుకున్న శుభ సందర్భంలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న మరిన్ని నిర్ణయాలు మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నా. రాష్ట్రంలోని మరో 2,696 ఆలయాలకు ధూప, దీప, నైవేద్య పథకాన్ని విస్తరిస్తాం. ఈ పథకం కింద నెలకు ఇచ్చే నిధులను (Funds) రూ.10 వేలకు పెంచుతున్నాం. వేద పండితులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచబోతున్నాం. అర్హత వయసు 75 నుంచి 65 ఏళ్లకు తగ్గించాం’ అని సీఎం కేసీఆర్ బ్రాహ్మణులపై వరాలు ప్రకటించారు. సుదీర్ఘ కాలం అపరిష్కృతంగా ఉన్న అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో చర్చించి పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘సనాతన ధర్మ పరిరక్షణ నిలయంగా, వేద పురాణాల ఇతిహాసంగా, విజ్ణాన సర్వస్వంగా, వైదిక క్రతువుల కరదీపికగా, పేద బ్రాహ్మణుల ఆత్మబంధువుగా, లోక కల్యాణకారిగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ (Telangana Brahmin Samkshema Parishad) ఆధ్వర్యంలో విప్రహిత సదనం వెలుగొందాలని దేవ దేవుణ్ని ప్రార్థిస్తున్నా’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.