»Singer Gaddar Contest In Next Elections Against Cm Kcr At Gajwel
KCRపై పోటీకి సిద్ధమంటున్న గద్ధర్..!
ప్రజా గాయకుడు గద్దర్(singer gaddar) ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్(CM KCR)పై తాను గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మరి ఈ అంశంపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్(gaddar) గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పాటలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన గళం ఎత్తి పాడితే ఎవరైనా మంత్ర ముగ్ధులై పాట వినాల్సిందే. తన పాటలతో అందరినీ ఉత్సాహపరిచే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు.
రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానంటూ ఆయన చేసిన ప్రకటనే అందరినీ షాకింగ్ కి గురిచేస్తే.. ఏకంగా వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతానని చెప్పారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(Cm Kcr)పై గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు తెలిపారు.
మెదక్ జిల్లా తూప్రాన్‌లో నిన్న పోలీసులను కలిసిన గద్దర్ తనకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన వయసు 76 సంవత్సరాలని, కాబట్టి ఇక నుంచి పుట్టిన ఊళ్లోనే జీవించాలని అనుకుంటున్నట్టు మనసులో మాటను బయటపెట్టారు.
తమ గ్రామంపై ‘మై విలేజ్ ఆఫ్ ది 60 ఇయర్స్’ పేరుతో పుస్తకం రాసినట్టు గద్దర్ తెలిపారు. రానున్న ఎన్నికలతో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్టు వివరించారు.