»Two Transgenders Contest In Telangana Assembly Elections 2023
Telangana assembly elections 2023: ఇద్దరు ట్రాన్స్జెండర్లు పోటీ..ఇక్కడి నుంచే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా అనేక మంది అభ్యర్థులు 119 నియోజకవర్గాల్లో పోటీకి దిగారు. పోటీ చేస్తున్న వారిలో ఈసారి ఇద్దరు ట్రాన్స్జెండర్లు(transgenders) కూడా ఉండటం విశేషం.
Two transgenders contest in Telangana assembly elections 2023
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు(Telangana assembly elections 2023) రేపే పోలింగ్ జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు వారి ప్రచారాన్ని నిన్న ముగించారు. ఈ ఎన్నికల పోటీలో పురుషులు, మహిళలతోపాటు ట్రాన్స్ జెండర్లు(transgenders) కూడా ఉన్నారు. అయితే ఈ ట్రాన్స్జెండర్లు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వారి విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో లింగ ప్రాతినిధ్యం 2014లో 9 మంది మహిళలు ఉండగా..110 మంది పురుషులు ఉన్నారు. ఇక 2019లో ఆరుగురు మహిళలు, 113 మంది పురుషులకు చేరింది. కానీ ఇప్పుడు తెలంగాణాలో తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఇద్దరు లింగమార్పిడి చేసుకున్న మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో జడ్చర్ల(jadcherla), వరంగల్ తూర్పు(warangal east)అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు ట్రాన్స్జెండర్ నేతలు మాతాశ్రీ జానకమ్మ, పుష్పిత లయ ఉన్నారు.
శివశక్తికి అంకితమైన మాతాశ్రీ జానకమ్మ (46) జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తన రాజకీయ భవితవ్యం తేల్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆమె తన దేవత ఆశీర్వాదంతో గంభీరమైన మాధుర్యంతో ఓటర్లను పలకరించింది. మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పుష్పిత లయ బీఎస్పీ(BSP) పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వీరి పోటీ నేపథ్యంలో స్థానిక వర్గాలతోపాటు ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అక్కడి ప్రజలు వీరిని గెలిపిస్తారో లేదో చూడాలి మరి. తెలంగాణలో 58,918 కంటే ఎక్కువ మంది ట్రాన్స్ జెండర్లు (సమగ్ర కుటుంబ సర్వే 2014 ప్రకారం) ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ లెక్క కాస్తా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు వీరికి రైతు బంధు వంటి అనేక పథకాలు అందడం లేదని వారి ఆరోపిస్తున్నారు. గృహనిర్మాణ పథకం వంటి రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలకు రావడం లేదన్నారు.