Neera Cafe:గ్రేటర్ వాసులను ఎప్పటినుంచో ఊరిస్తోన్న నీరా కేఫ్ (Neera Cafe) ఈ రోజు నుంచి అందుబాటులోకి రానుంది. హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న కేఫ్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (ktr) ప్రారంభిస్తారు. నీరా కేఫ్ (Neera Cafe) కోసం రూ.20 కోట్లు ఖర్చు చేశారు. రెస్టారెంట్‌ను తలపించే కేఫ్.. ఆధునాతనంగా తీర్చిదిద్దారు.
ఫస్ట్ ప్లోర్లో నీరా (neera) లభిస్తోంది. గ్రౌండ్ ప్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. తాటి చెట్టు, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరాను శుద్ది చేసి ఇందులో విక్రయిస్తారు. నీరా ఉత్పత్తులు కూడా ఇక్కడ లభిస్తాయి. ఏడు స్టాళ్లు ఉన్నాయి. నీరా కేఫ్‌లో (Neera Cafe) ఓకేసారి 500 మంది కూర్చొనే వెసులుబాటు కల్పించారు. నీరాను కొనుగోలు తీసుకెళ్లే సౌకర్యం కూడా కల్పించారు.
నీరాను పరిశ్రమ స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్ ఏర్పాటు చేసింది. నగర శివారు నందన వనంలో గల పదెకరాల్లో ఉన్న తాటి చెట్ల నుంచి నీరాను సేకరిస్తారు. నీరా నాలుగు డిగ్రీల వద్ద సురక్షితంగా నిల్వ ఉంటుంది.
తాటి, ఈత చెట్ల నుంచి నీరా సేకరించాక.. దానిని సీసాల్లో పోసి.. ఐస్ బాక్సుల్లో నగరానికి తీసుకొస్తారు. నీరా కేఫ్‌లో (Neera Cafe) శుద్ది చేసి.. ప్యాకింగ్ చేసి విక్రయిస్తారు. నీరా కేఫ్ (Neera Cafe) పై కప్పును తాటా ఆకృతితో రూపొందించారు. నీరా కేఫ్ నుంచి ట్యాంక్ బండ్లో గల బుద్ద విగ్రహం వరకు బోటింగ్ సౌకర్యం కల్పించారు.
నీరా (neera) అంటే కల్లు కాదు.. ఇందులో ఆల్కహాల్ ఉండదు. రుచి తియ్యగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. నీరా ధరలపై మాత్రం స్పష్టత లేదు. సామాన్యులకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.