హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ (HCU ) ఎన్నికల్లో SFI కూటమి ఘన విజయం సాధించింది. SFI, ASA, DSU సంఘాల కూటమి తరుపున పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి ఏబీవీపీ (ABVP )పై ఘన విజయం సాధించింది. అధ్యక్షుడుగా ప్రజ్వల్ 608 ఓట్ల మెజార్టీతో గెలవగా, ఉపాధ్యక్షుడిగా పృధ్వీ 700, ప్రధాన కార్యదర్మిగా కృపరియా గెలిచారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ (HCU ) ఎన్నికల్లో SFI కూటమి ఘన విజయం సాధించింది. SFI, ASA, DSU సంఘాల కూటమి తరుపున పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి ఏబీవీపీ (ABVP )పై ఘన విజయం సాధించింది. అధ్యక్షుడుగా ప్రజ్వల్ 608 ఓట్ల మెజార్టీతో గెలవగా, ఉపాధ్యక్షుడిగా పృధ్వీ 700, ప్రధాన కార్యదర్మిగా కృపరియా గెలిచారు. కాగా OBCF, SLVD కూటమితో కలిసి పోటీ చేసిన ABVP అభ్యర్థులందరూ ఓడిపోయారు.ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి ప్రజ్వల్ 313 ఓట్ల ఆధిక్యంతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరో కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవికి కృపా మారియా జార్జ్ ఎన్నికయ్యారు. జార్జ్‌కు 1014 ఓట్లు లభించాయి. సమీప ఏబీవీపీ అభ్యర్థికి 586 ఓట్లు మాత్రమే వచ్చాయి. 247 ఓట్లతో ఏఎస్డీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.స్పోర్ట్స్ సెక్రటరీ పదవికి ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి సీహెచ్ జయరాజ్ 105 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు. జయరాజ్‌కు 802 ఓట్లు లభించగా, సమీప ఏబీవీపీ ప్రత్యర్థికి 697 ఓట్లు వచ్చాయి.
జాయింట్ సెక్రటరీగా కూడా ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి గెలుపొందారు.సామరస్యానికే హెచ్‌సీయూ ఓటు ఎన్నికలకు ముందు కొన్ని రోజుల క్రితం బీబీసీ ( BBC) రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ (MODI: THE INDIA QUESTION) అనే డాక్యుమెంటరీ ప్రదర్శన విషయంలో సెంట్రల్ యూనివర్సిటీలో వివాదం చెలరేగింది. ఇదే సమయంలో ఏబీవీపీ శ్రేణులు కశ్మీర్ ఫైల్స్ (KASHMIR FILES) చిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎస్ఎఫ్ఐ (SFI) కూటమి ఘన విజయం సాధించడం నగరంలో విద్యార్థులు సామరస్య వాతావరణాన్ని కోరుకుంటున్నారన్న అంశానికి మరింత ఊతమిచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యుదయ శక్తులకు, ప్రగతిశీల శక్తులకు నిలయంగా ఉన్న హైదరాబాద్‌లో మతోన్మాద భావనలు చొప్పించడం సాధ్యం కాదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఏకకంఠంతో చాటి చెప్పినట్టయింది. భావితరం ఏమి కోరుకుంటున్నదో ఈ ఎన్నిక రుజువు చేసింది. కుహనా జాతీయవాదాన్ని కాదని, వామపక్ష భావజాలానికి విద్యార్థులు మద్దతు పలికారు.