»Warangal Kmc Medical Student Preethi Phone Call To The Spotlight Is A Conversation With Her Mother
Preethi Audio Call: ప్రీతి సంచలన ఫోన్ కాల్ సంభాషణ వెలుగులోకి..
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సూసైడ్ అటెమ్ట్ కోసం ప్రయత్నించిన ప్రీతి ఫోన్ కాల్ సంచలన సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిలో సైఫ్ వేధించినట్లు స్పష్టంగా ప్రీతి తన తల్లితో చెప్పడం బయటకు వచ్చింది. సీనియర్లు అందరూ ఒక్కటిగా ఉన్నారని, సైఫ్ తనతోపాటు అనేక మందిని వేధించినట్లు ఫోన్ సంభాషణలో తెలిపింది.
ఓరుగల్లు(Warangal) ఎంజీఎం(MGM) ఆస్పత్రిలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రీతి ఫోన్ కాల్(Preethi phone call) ఆడియో(audio) సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియోలో ప్రీతి తన తల్లితో మాట్లాడుతున్నట్లు తెలిసింది. అయితే సైఫ్(saif) వేధింపులు ఎక్కువగా అవుతున్నాయని ఆమె తన తల్లితో చెబుతుంది. అంతేకాదు సీనియర్లు(seniors) అందరూ ఒక్కటయ్యారని, తనతోపాటు అనేక మంది జూనియర్లను వేధిస్తున్నట్లు వెల్లడించింది. తాను సైఫ్ పై కంప్లైంట్ చేస్తే సీనియర్లు తనకు దూరంగా ఉంటారని తెలిపింది. అదే క్రమంలో తల్లి(mother) సైఫ్(saif) తో మాట్లాడాతనని పేర్కొంది. కానీ అప్పటికే ప్రీతికి వేధింపులు ఎక్కువ కావడంతో సూసైడ్ అటెమ్ట్(suicide attempt) చేసుకున్నట్లు ఆడియో ద్వారా తెలుస్తోంది.
మరోవైపు ప్రీతి(Preethi)ప్రస్తుతం నిమ్స్(nims) ఆస్పత్రి(hospital)లో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసి ప్రకటించారు. తనను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఇప్పటికే ప్రీతి హెల్త్ కండీషన్ గురించి పలువురు రాజకీయ నేతలు ఆరా తీశారు. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) ప్రీతి ర్యాగింగ్ ఘటనకు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రగతి భవన్లో కూడా పేద వర్గాలపై ర్యాంగిగ్ జరుగుతోందని ఎద్దేవా చేశారు. ఇంకోవైపు ఆరోగ్య మంత్రి హరీశ్ రావు(harish rao) సైతం ఈ ఘటనపై స్పందించారు. ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కేసుపై విచారణ జరుగుతుందని..బాధ్యలను కఠినంగా శిక్షిస్తామని..ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు.
ఈ క్రమంలో పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్యహత్యాయత్నం కేసులో సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ను సస్పెండ్ చేశారు. మెడికల్ లీగల్ కేసుగా పరిగణించి చర్యలు తీసుకున్నామని ఎంజీఎం(MGM) ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. మరోవైపు వేధింపులు నిజమని ఖరారై శిక్ష పడితే కాలేజీ నుంచి అతన్ని బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ఇంకోవైపు కేఎంసీ కాళాశాలలో సీనియర్లను జూనియర్ల సార్ అని పిలవడంపై దృష్టి పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏపీ రంగనాథ్(Warangal cp ranganath) కీలక వ్యాఖ్యలు చేశారు. అలా పిలవడం కూడా ర్యాగింగ్ పరిధిలోకే వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో సీనియర్, జూనియర్ల మధ్య దూరం పెరిగే అవకాశం ఉందని గుర్తు చేశారు.
వరంగల్ ఎంజీఎం(warangal mgm) ఆస్పత్రిలో బుధవారం పీజీ విద్యార్థి(pg medical student)ని ప్రీతి.. సీనియర్ సైఫ్ వేధింపులు(harassment by senior)తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆమె పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరోవైపు వేధింపుల గురించి కాలేజ్, ఆస్పత్రి అధికారులకు చెప్పినా కూడా వారు పట్టించుకోలేదని విద్యార్థిని తల్లిదండ్రులు(parents) అంటున్నారు.
కాకతీయ మెడికల్ కాలేజీలో(kakatiya medical college) ధరావత్ ప్రీతి అనే ఈ విద్యార్థిని అనస్థీషియా కోర్సులో మొదటి సంవత్సరం చదువుతుంది. ఆ క్రమంలో ఓ సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్(saif) కొన్ని నెలలుగా తనను వేధిస్తున్నాడని ఆమె పేరెంట్స్ తెలిపారు. రెండు రోజుల క్రితం ఈ విషయం తనకు తెలిపిందని ఆమె పేరెంట్స్ చెప్పారు. దీంతో ఇదే అంశంపై మట్టెవాడ పోలీసుల(police)కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఆ తర్వాత ప్రిన్సిపల్(principal) ఇతర డాక్టర్ల సమక్షంలో సైఫ్ ను మందలించారని గుర్తు చేశారు. ఇది జరిగిన రెండు రోజులకే మళ్లీ సైఫ్ మంగళవారం రాత్రి కూడా వేధించినట్లు తెలిసింది. ఆ నేపథ్యంలో ప్రీతి బుధవారం ఉదయం హనికరమైన ఇంజక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత గుర్తించిన అధికారులు ఆమెను ఐసీయూ(ICU) వార్డుకు తరలించి చికిత్స అందించారు. కానీ పరిస్థితి తీవ్రం కావడంతో హైదరాబాద్(hyderabad) నిమ్స్(NIMS) ఆస్పత్రికి తరలించారు.
జనగామ జిల్లా మొండ్రాయి గిర్ని తండాకు చెందిన ధరావత్ నరేందర్ నాయక్ వరంగల్ ఆర్పీఎఫ్ ఏస్సైగా పనిచేస్తున్నారు. అతనికి ముగ్గురు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉండగా..చిన్న కుమార్తె ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీ(kakatiya medical college)లో డాక్టర్ విద్యనభ్యసిస్తుంది.