హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి జయకేతనం ఎగురవేసింది. 2023–24 విద్యాసంవత్సరానికి విద్యార్థి సంఘ ఎన్నికల నిర్వహించారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. (SFI Alliance) కూటమి ఆఫీస్ బేరర్స్ పోస్టులను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. ఏబీవీపీ కూటమిపై ఘన విజయం సాధించింది. అధ్యక్ష్య స్థానానికి పోటీపడిన ఎస్ఎఫ్ఐ మహ్మమద్ అతిక్ అహ్మద్ (Atiq Ahmed) 1880 ఓట్లు పొంది, ప్రత్యర్థి ఏబీవీపీ అభ్యర్థికంటే 471 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉపాధ్యక్ష స్థానానికి జలి ఆకాష్ (SFI కూటమిలో భాగస్వామి ఏఎస్ఏ) 1671 ఓట్లు సాధించగా, తరుణ్ (ABVP)కు 1283 ఓట్లు రాగా, 388 ఓట్ల మెజారిటీ తో ఆకాష్ గెలుపొందారు.
ప్రధాన కార్యదర్శిగా దీపక్ కుమార్ ఆర్య (ఎస్ఎఫ్ఐ కూటమిలో భాగస్వామి ఏఎస్ఏ అభ్యర్థి) 1765 ఓట్లు సాధించి విజయాన్ని అందుకున్నారు. సహాయ కార్యదర్శిగా లావుడి బాలంజనేయులు (ఎస్ఎఫ్ఐ కూటమిలో భాగస్వామి టీఎస్ఎఫ్ అభ్యర్థి), సాంస్కృతిక కార్యదర్శిగా షమిమ్ అక్తర్ షేక్ (ఎస్ఎఫ్ఐ కూటమిలోభాగస్వామి ASA అభ్యర్థి), క్రీడా కార్యదర్శిగా అతుల్ (ఎస్ఎఫ్ఐ అభ్యర్థి) గెలుపోందారు.జీఎస్ క్యాష్ ఇంట్రిగేటెడ్ లో ఎస్ఎఫ్ఐ అభ్యర్థి నందన పలికిల్ ఏబీవీపీ అభ్యర్థి వజి.విన్సిక పై గెలుపొందారు, జీఎస్ క్యాస్(పీజీ)లో ఎస్ఎఫ్ఐ అభ్యర్థిని కే పూజ ఏబీవీపీ అభ్యర్థి అరుణపై గెలుపొందారు. జీఎస్ క్యాష్ (రిసెర్చ్)లో ఎస్ఎఫ్ఐ కూటమిలో భాగస్వామి ఏఎస్ఏ అభ్యర్థి సౌమ్య కేపీ ఏబీవీపీ అభ్యర్థి పవనపై గెలుపొందారు.