Child: పోకిరీలకు బుద్ది చెప్పాల్సిన ఓ ఎస్ఐ (si).. పోరంబోకులా ప్రవర్తించాడు. ఓ చిన్నారిపై (children) లైంగికదాడికి తెగబడ్డాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో (Rajasthan) జరిగింది. సదరు ఎస్ఐను అరెస్ట్ చేశారు. కఠినంగా శిక్షించాలని చిన్నారి పేరెంట్స్, స్థానికులు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.
దౌసా జిల్లా రహువాస్ పోలీస్ స్టేషన్లో భూపేంద్ర సింగ్ ఎస్ఐగా పని చేస్తున్నాడు. డ్యూటీ సమయంలో కొలిగ్ ఇంటికి వెళ్లాడు. పక్కనే ఉన్న నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ అతని గది వద్దకు వచ్చింది. చాక్లెట్, బిస్కెట్ ఇస్తానని గదిలోకి తీసుకెళ్లాడు. తర్వాత లైంగికదాడికి తెగబడ్డాడు.
ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని బాలిక తల్లికి వివరించింది. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయం చేయాలని స్థానికులు స్టేషన్ ఎదుట నిరసనకు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా.. చిన్నారికి న్యాయం చేయాలన్నారు. గెహ్లట్ ప్రభుత్వ అసమర్ధత వల్ల కొందరు పోలీసులు ఇలా తయారయ్యారని విమర్శించారు.
రాజస్థాన్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వైఖరికి నిదర్శనం అని బీజేపీ అంటోంది. కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ కవర్ చేసుకుంటుంది.