బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishnamohan Reddy) అనర్హత తీర్పులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కృష్ణమోహన్‌రెడ్డిని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధించింది. ఇటీవల గద్వాల ఎమ్మెల్యేగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna)ను నియమిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్(Affidavit)లో కృష్ణమోహన్ రెడ్డి సరైన సమాచారం ఇవ్వలేదని డీకే అరుణ వేసిన పిటిషన్‌పై ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో పోటీ చేసినందుకు ఎమ్మెల్యేపై హైకోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్ (Vinod Kumar)అనర్హత వేటు వేశారు.
అయితే బండ్లపై హైకోర్టు అనర్హత తీర్పు వెలువరించిన రోజు తాను ఈ తీర్పుపై సుప్రీంకోర్టు(Supreme Court)కు వెలుతానని, వచ్చే ఎన్నికల్లో 50వేల మెజార్టీతో గెలుస్తానని ప్రకటించుకున్నారు. తీరా తీర్పు కాపీ చూస్తే అందులో ఆరేళ్ల అనర్హత వేటు నేపధ్యంలో ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయినట్లయ్యింది. దీంతో బండ్లకు బీఆరెస్ తొలిజాబితాలో సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటించిన టికెట్ గల్లంతయ్యే పరిస్థితి పొంచివుంది. ఒకవేళ బండ్ల హైకోర్టు (High Court) తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళితే…అక్కడ ఆయనకు ఏదైనా ఉపశమనం లభిస్తే మాత్రం ఎన్నికల్లో పోటీకి మార్గం సుగమం కానుంది.