సాయం చేసిన మనిషిని అవసరం తీరాక మరిచిపోతున్న రోజులివి. కానీ ఓ మహిళ (A woman) మాత్రం తన ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారిని మరిచిపోలేదు. సుమారు తొమ్మిదేళ్ల తరువాత ఆ అధికారి ఎదురుకాగానే ఆమె ఆనందానికి అవధుల్లేవు. బస్సు దిగి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయనకు కృతజ్ఞత (Gratitude) తెలిపింది. ఈ రోజు తాను బతికి ఉన్నానంటే మీరే కారణమంటూ అతనిపై కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్న తీరు అక్కడున్న వారి హృదయాన్ని తాకింది. మహంకాళి ఏసీపీగా ఉన్న రవీందర్ (Ravinder)2014లో టప్పాచబుత్రలో ఇన్స్పెక్టర్గా పని చేశారు.
కార్వాన్ కు చెందిన కవిత కడుపులో గడ్డలు కాగా తీవ్ర నొప్పితో అనారోగ్యానికి గురైంది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆమెను పట్టించుకునే వాడు లేకపోవడంతో నరకయాతన అనుభవించేది. అప్పుడు ఇన్ స్పెక్టర్ గా ఉన్న రవీందర్ ఆమెను ఆసుపత్రి(Hospital)లో చేర్పించి సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వివిధ స్టేషన్లకు బదిలీ అవుతూ వెళ్లారు. కాల క్రమంలో ఆయన ఈ విషయాన్ని మరిచిపోయారు.రవీందర్ ను తన ప్రాణాలు కాపాడిన దేవుడిగా కొలుస్తూ సెల్ ఫోన్ వాల్ పేపర్ పై అతని ఫొటో పెట్టుకుంది. తొమ్మిదేండ్లు అయినా ఆయనను మరిచిపోలేదు. ఆయనకు రాఖీ (Rakhi) కట్టాలని తను బతికి ఆనందంగా ఉన్నానని ఆయనకు తెలియాలని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
ఇందులో భాగంగా. కవిత పని చేసుకునేందుకు బస్సులో సికింద్రాబాద్(Secunderabad)కు వెళ్తుండగా.. ఆర్పీ రోడ్ దర్గా వద్ద విధుల్లో ఉన్నారు రవీందర్. చూసి గుర్తు పట్టిన ఆమె బస్సు కొంత దూరం వెళ్లాక సిగ్నల్ పడడంతో ఆగిపోవడంతో దిగింది. ఆయన వెళ్లిపోతారు కావచ్చని పరుగులు పెట్టింది. ఏసీపీ (ACP) రవీందర్ వద్దకు వచ్చి కాళ్లకు దండం పెట్టింది. కానీ ఆయన ఆమెను గుర్తు పట్టేలేదు. ఎవరమ్మా అని అడగడంతో తాను పరిచయం చేసుకుంది. ‘సార్.. మీకు వెండి రాఖీ తీసుకొచ్చి కడతాను. ఫోన్ నంబరు ఇవ్వండి’ అంటూ అడిగి తీసుకొని వెళ్లిపోయింది.