టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా ఏఎస్ రవి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తిరగబడరసామి’ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మూవీ టీమ్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వగా.. డైరెక్టర్ రవికుమార్ (Director Ravikumar) అందరి ముందు హీరోయిన్ మన్నారచోప్రా భుజంపై చెయ్యి వేసి ముద్దు పెట్టుకున్నారు. ఓ హీరోయిన్‌తో డైరెక్టర్ ఇలా ప్రవర్తించడంపై సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. హీరో రాజ్ తరుణ్ హీరోగా ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తిరగబడర సామీ’(Tiragabadara Saami) టీజర్ ను దిల్ రాజు లాంచ్ చేశారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా సాగింది. హీరో రాజ్ తరుణ్ ఇందులో వైలెన్స్ కు వ్యతిరేకంగా ఉండే అమాయకమైన కుర్రాడు కాగా అతను ప్రేమించే అమ్మాయికి వైలెన్స్ అంటే ఇష్టం.
ఆసక్తికరమైన విషయమేమిటంటే వీరిద్దరూ నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులే కావడం, ఇక పరిస్థితులు అతని ట్రాక్ మార్చడానికి, హింసాత్మక మార్గాన్ని తీసుకోవాలని ప్రేరేపిస్తాయి. తన వాళ్ళ కోసం తన మార్గాన్ని మార్చే అమాయక యువకుడి పాత్రలో రాజ్ తరుణ్ యాప్ట్ గా కనిపించగా హీరోయిన్ గా నటించిన మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra) అందంగా కనిపించింది.ఇక ఈ సినిమా విషయానికి వస్తే జెబి సంగీతం అందిస్తుండగా జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్ కాగా భాష్యశ్రీ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఏఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ తెలుగు ఇండస్ట్రీలో మరో యాక్షన్ హీరో అవుతాడని ఇది నా ప్రామిస్ ఇందులో సందేహం లేదని అన్నారు.తను డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అని ఆయన అన్నారు. అలాగే మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా (Mannara Chopra) మంచి పాత్రలు చేశారని అన్నారు.