కాంట్రవర్సీలు చేయడంలో ముందుండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఎప్పటికప్పుడు తనకు సంబంధం లేని విషయాల గురించి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ… వివాదాలు సృష్టిస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి ఇలాంటి కామెంట్లతో ఆర్జీవీ ముందుకొచ్చాడు. అయితే.. ఈసారి ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ట్వీట్ చేయడం గమనార్హం.
తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అంటూ పొగిడేశారు. ‘బాహుబలి, RRR, పుష్ప, KGF 2 సినిమాల అడుగుజాడల్లో నడుస్తూ టీఆర్ఎస్ పార్టీ కూడా పాన్ ఇండియా వైడ్‌గా BRSగా వెళుతుంది. రీల్ ఫిల్మ్ స్టార్స్ యాష్, తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వలె కాకుండా.. రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్..’ అంటూ వర్మ రాసుకొచ్చారు.
ఇటీవలె ఇందిరా గాంధీని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్‌గా ట్వీట్ చేసి వివాదానికి తెరలేపారు వర్మ. ఎమర్జెన్సీ మూవీలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందిరా గాంధీ 1984లో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో లింక్‌ను షేర్ చేసిన ఆర్జీవీ.. ఇందిరా గాంధీ అచ్చం కంగనాలానే నటించిందని.. కావాలంటే పూర్తి ఇంటర్వ్యూ చూడండి అంటూ ట్వీట్ చేశారు. అయితే వర్మ ట్వీట్‌ను కాంగ్రెస్ వర్గాలు పెద్దగా పట్టించుకోలేదు.