»Revanth Reddy Said Kcrs Family Assets Worth One Lakh Crores Telangan Congress Complains To Cbi On Tspsc Paper Leak
Revanth Reddy: కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తి రూ.లక్ష కోట్లు..పేపర్ లీక్ పై సీబీఐకి టీకాంగ్రెస్ ఫిర్యాదు
సీఎం కేసీఆర్ కుటుంబం ఆస్తి లక్ష కోట్ల రూపాయలకు చేరుకుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) వ్యాఖ్యానించారు. అంతేకాదు రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. లేదంటే తాను 50 ఫిర్యాదులు చేసినా కూడా ఎందుకు కేసీఆర్ ఫ్యామిలీపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోవైపు TSPSC పేపర్ లీక్ అంశంపై గతంలో ఈడీకి ఫిర్యాదు చేసిన టీకాంగ్రెస్ తాజాగా సీబీఐకి కంప్లైంట్ చేసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్(cm kcr) ఆస్తి లక్ష కోట్ల రూపాయలకు పెరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) ఆరోపించారు. ఈ క్రమంలో కేసీఆర్ ఫ్యామిలీపై బీజేపీ ఒక్క కేసైనా పెట్టిందా అంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టే బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) మధ్య సంబంధాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చని అన్నారు. మరోవైపు లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె కవితను సైతం బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. మరోవైపు కేసీఆర్ ఆస్తులపై తాను ఇప్పటికే 50 కంప్లైంట్స్ ఇచ్చానని వెల్లడించారు. కానీ వాటిలో ఒక్కదానిపై కూడా చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అయితే ప్రస్తుతం తెలంగాణలో 80 శాతం ప్రజలు కేసీఆర్ ఫ్యామిలీ(KCRs family)కి వ్యతిరేకంగా ఉన్నట్లు రేవంత్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్(congress party) వైపు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్, బీజేపీలు ప్రజలకు ఉపయోగపడే చేసిన పనులు చెప్పాలని నిలదీశారు. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీనే మొదలు పెట్టినట్లు స్పష్టం చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలలో అనేక అంశాలను గాలికి వదిలేశారని రేవంత్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్.. ఎన్నికల సమయం రాగానే నోటిఫికేషన్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు వస్తాయని, కేసీఆర్ కు 25 లోపే వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక బీజేపీ మాత్రం సింగిల్ డిజిట్ లోనే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు TSPSC పేపర్ లీక్ అంశంపై మంగళవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ(telangana congress party) సీబీఐ(CBI)కి కంప్లైంట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం కోఠీలోని సీబీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహరంలో లక్షల రూపాయల అక్రమాలు జరిగాయని, వాటి గురించి విచారణ జరపాలని కోరారు. అయితే ఇప్పటికే టీకాంగ్రెస్ ఈ ఘటనపై ఈడీకీ కూడా ఫిర్యాదు చేసింది.