»Revanth Reddy Cabinet Telangana New Ministers Portfolio List
Telangana new ministers: రేవంత్ రెడ్డి కేబినేట్లో వీరికే ఛాన్స్..మరి ఐటీ శాఖ ఎవరికి?
తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎంతోపాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వారిలో ఎవరెవరు ఉన్నారు. వారి వివరాలేంటనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
revanth reddy cabinet new portfolio ministers list
తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు 11 మంది కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత బీఆర్ఎస్ రాష్ట్ర మంత్రివర్గం స్థానంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మంత్రివర్గం కొలువుదీరింది. ఈ జాబితాలో వివిధ కులాల నేపథ్యం ఉన్న అభ్యర్థులు ఉన్నారు. దీంతోపాటు పదకొండు మందిలో ఇద్దరు మహిళలతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది.
పార్టీ సీనియర్ నేత ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ దక్కగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపల్ పరిపాలన శాఖను అప్పగించారు. శ్రీధర్‌బాబుకు ఆర్థిక శాఖను, ఫైర్‌బ్రాండ్ కొండా సురేఖకు మహిళా సంక్షేమ శాఖను కేటాయించారు. ఇక మల్లు భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రెవెన్యూ శాఖను కూడా అప్పగించారు. దామోదర్ రాజనరసింహకు మెడికల్ అండ్ హెల్త్, జూపల్లి కృష్ణారావు ప్రజాపంపిణీ శాఖ, పొన్నం ప్రభాకర్-బీసీ సంక్షేమ శాఖ, మాజీ నక్సలైట్ సీతక్క గిరిజన సంక్షేమం దక్కాయి. తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు భవనాలు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి నీటిపారుదల శాఖ దక్కింది. ఇక ఐటీ శాఖ ఎవరికి ఇచ్చారనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పన్నెండు మంది మంత్రులతో ప్రమాణం చేయించారు.