»Ramulamma Gave Clarity On Party Change Konda Vishweshwar Reddy Is On The Same Path
Vijayashanti : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన రాములమ్మ..అదే బాటలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి
బీఆర్ఎస్ నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు..భారతీయ జనతా పార్టీ వైపు నిలబడాలని మరెంతో మంది బిడ్డలు ఇంకోవైపు. రెండు అభిప్రాయాలు కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మేలు కోసమే. అయినా సినిమాల తరహాలో ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యపడదని విజయశాంతి ట్వీట్ చేశారు.
తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి (Vijayashanti) ఆసక్తికర ట్వీట్ చేశారు. సినిమాల్లోని ద్విపాత్రాభినయం రాజకీయల్లో సాధ్యపడదని అభిప్రాయపడ్డారు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పనిచేయగలుగుతానని తన వైఖరిని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. బీఆర్ఎస్ (BRS) దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్ నుంచి పోరాడాలని కొందరు సూచిస్తున్నారని చెప్పారు. మరోవైపు బీజేపీ (BJP)ని విధాన పూర్వకంగా విశ్వసించి 1998 నుంచి పనిచేస్తున్న నేతగా, స్పష్టమైన హిందూత్వవాదిగా బీజేపీ వైపే నిలబడాలని మరెంతో మంది బిడ్డలు సూచిస్తున్నారని అన్నారు. నిజానికి ఈ రెండు అభిప్రాయాలు తెలంగాణా(Telangana)లో దుర్మార్గ కేసిఆర్ పరిపాలన పరిస్థితుల నుంచి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రానికి మేలు కోసమే అయినా పార్టీ మారలేనని విజయశాంతి స్పష్టం చేశారు.
సినిమా తీరుగా పోలీస్ లాకప్, రౌడీ దర్బార్, నాయుడమ్మ (Nayudamma Movie) లెక్క ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాలలో సాధ్యపడదని చెప్పారు. ఏదైనా ఒక పార్టీ కి మాత్రమే పని చేయగలుగుతామని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.ఇకపోతే రాములమ్మ పార్టీకి కొద్ది కాలంగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో సరైన ప్రాధాన్యం లేదని పలుమార్లు అసంతృప్త నేతలంతా సీక్రెట్ మీటింగ్ (Secret meeting) పెట్టారు. అందులో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అజిటేషన్స్ కమిటీ చైర్మన్గా విజయశాంతిని పార్టీ నియమించింది. అయినా ఆమె ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎలాంటి నిరసనలు, పోరాటాలు చేసింది లేదు. అప్పట్లోనే పార్టీ మారుతారని అందరూ భావించారు. బీజేపీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీకి గుడ్ బై చెప్పగా? తాజాగా మాజీ ఎంపీ వివేక్ (Ex MPVivek) రాజీనామా చేశారు. వీరి దారిలోనే మరో ఇద్దరు నేతలు సైతం పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు విజయశాంతి కూడా వీడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.