మరో నాలుగు రోజులు తెలంగాణ(Telangana)లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Rain) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Weather Department) వెల్లడించింది. కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ భీకర గాలులు వీస్తున్నాయని, వాటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ (Weather Department) హెచ్చరించింది.
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలులు వీస్తాయని, వడగండ్లతో కూడిన వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ(Weather Department) ఎల్లో అలెర్ట్(yellow alert) జారీచేసింది.
ఏప్రిల్ 30వ తేది వరకూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, అయితే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ(Weather Department) వెల్లడించింది. రాత్రిపూట చలిగాలుల ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.