TSRTC MD Sajjanar : ఆ మోసాలతో జాగ్రత్త..టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్
కేటుగాళ్ల మాయలో పడి, అధిక వడ్డీ ఆశతో చాలా మంది డబ్బులను పోగొట్టుకుంటున్నారని, క్యూ నెట్ తరహా దందా పెరుగుతోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల ఆశలనే అస్త్రాలుగా చేసుకుని వారిని నిలువునా దోచేస్తున్నారు. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు. క్యూనెట్(Q NET) సంస్థ తరహాలో మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ఇటువంటి మోసాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్(TSRTC MD Sajjanar) స్పందించారు. బాధితులను చూసి ఆవేదన వ్యక్తం చేశారు.
క్యూనెట్(Q NET) తరహా మోసాలు పెరుగుతున్నాయని, ఇటువంటి మోసాలపై ఎంత చెబుతున్నా కూడా తగ్గడం లేదని సజ్జనార్(TSRTC MD Sajjanar) ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలె తనను కొందరు బాధితులు ఆశ్రయించారని, వారిని చూసి తనకు చాలా బాధేసిందని సజ్జనార్ తెలిపారు. ప్రజలను ఉద్దేశించి సజ్జనార్ చేసిన ట్వీట్(Tweet) సంచలనంగా మారింది. చాపకింద నీరులా క్యూనెట్ తరహా దందాలు కొనసాగుతున్నాయని, తాజాగా ఓ చార్టర్డ్ అకౌంటెంట్ క్యూనెట్(Q NET) వలలో పడ్డాడని తెలిపారు. అధిక డబ్బుకు ఆశపడి రూ.8 లక్షలు పోగొట్టుకున్నట్లు ట్విట్టర్ ద్వారా సజ్జనార్ తెలిపారు.
చాలా మంది తమకు జరిగిన మోసాలపై ట్విట్టర్ లో సందేశాలు పంపుతున్నారని, మోసాలకు పాల్పడే సంస్థలపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు దృష్టి సారించాలన్నారు. ఇటువంటి తరహా ఘటనలపై సుమోటోగా కేసు నమోదు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్(TSRTC MD Sajjanar) ట్వీట్ చేశారు. డబ్బుల విషయంలో ప్రజలకు కూడా అత్యాశకు పోయి మోసపోవద్దని సూచించారు. మోసపోయాక ఎవరిని నిందించినా ఏం ప్రయోజనం ఉండదన్నారు. అందుకే ఏదైనా చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలని సూచించారు. ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ సజ్జనార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్(Tweet Viral) అవుతోంది.
సజ్జనార్ చేసిన ట్వీట్:
ఎంత చెబుతోన్న డెరెక్ట్ సెల్లింగ్ ముసుగులో గొలుసుకట్టు మోసాలు జరుగుతూనే ఉన్నాయి. చాపకింద నీరులా #QNet తరహా దందాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ యువ చార్టర్డ్ అకౌంటెంట్ దుర్మార్గపు సంస్థ #QNet వలలో చిక్కుక్కున్నారు. అధిక డబ్బుకు ఆశపడి రూ.8 లక్షలను సమర్పించుకున్నట్లు… pic.twitter.com/Jjh2tBUCeM