రాష్ట్రంలో నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Moderate rains) కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నిన్న నల్గొండ (Nalgonda), ఖమ్మంలో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదయ్యాయని పెర్కొంది.రాష్ట్రంలో గత వారం భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది.రాష్ట్ర వ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురవడంతో భారీ నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. ఈ ఏడాది భారీ వర్షాలు (Heavy rains) జనాన్ని హడలెత్తించినా గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత సీజన్లో వర్షాలు 19 శాతం తక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ (Weather Dept) తెలిపింది. గత ఏడాది జూన్ నుంచి జులై 30 వరకు 687.1 మిల్లీమీటర్ల వాన పడింది. ఈ ఏడాది ఇప్పటివరకు 559.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసిందని తెలిపింది.