సికింద్రాబాద్ ఆల్పా హోటల్(Alpha Hotel)ని ఫుడ్ సెఫ్టీ అధికారులు సీజ్ చేశారు.హోటల్లో మటన్ కీమా, రోటి తిన్న లోయర్ ట్యాంక్ బండ్ వాసి జమాలుద్దీన్ అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకున్నాడు. దీనిపై మేనేజర్‌కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లేదని మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ అధికారులు (GHMC officers) రైడ్స్ చేసి సీజ్ చేశారు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.హోటల్లో అపరిశుభ్ర వాతావరణం, కస్టమర్ల (Customers) కు నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేపట్టి హోటల్ మూయించేశారు. ఈ హోటల్‌పై అనేక మంది కస్టమర్లు అధికారులకు పలువురు కంప్లైంట్ చేశారు. అంతకుముందు కొద్ది రోజులుగా హోటల్లోని అపరిశుభ్ర వాతావరణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్‌గా మారి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో హోటల్లో తనిఖీలు నిర్వహించి సీజ్ చేసిన అధికారులు అక్కడి శాంపిళ్ల(Samples)ను పరీక్షల కోసం నాచారంలోని స్టేట్‌ఫుడ్ లాబ్‌కు పంపించారు.