Minister Roja: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా (Minister Roja) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న మంగళగిరిలో జరిగిన పార్టీ విసృతస్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. సీఎం జగన్‌ను నువ్వెంత, నీ బతుకెంత అని అన్నారు. ఆ వ్యాఖ్యలపై మంత్రి రోజా (Roja) కౌంటర్ అటాక్ చేశారు. ముందు నీ బతుకేంటో చూసుకో అని మండిపడ్డారు. జగన్ కంటే రాజకీయాల్లోకి ముందు వచ్చి ఏ చేశావని అడిగారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేకపోయావని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల జెండాలు మోసే కూలీ పవన్ కల్యాణ్ అని.. స్థాయికి మించి మాట్లాడటం తగదని హితవు పలికారు.
13 ఏళ్ల కింద జగన్ రాజకీయాల్లోకి వచ్చారని రోజా గుర్తుచేశారు. రెండు సార్లు ఎంపీగా గెలిచారని పేర్కొన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని వివరించారు. ఓ సారి విపక్ష నేతగా.. తర్వాత 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని సీఎం పదవీ చేపట్టారని తెలిపారు. మరీ ఇన్నేళ్లు పార్టీలలో ఉంటూ.. మీరేం చేశారని పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు.
నీ తల్లిని తిట్టినవాడితో ప్యాకేజీ కోసం బానిస బ్రతుకు బ్రతుకుతున్నావ్, నువ్వెంత నీ బ్రతుకెంత నీ స్థాయి ఎంత – మంత్రి రోజా. pic.twitter.com/vjjfBVoKiU
ఇటు నారా బ్రాహ్మణిపై కూడా రోజా మండిపడ్డారు. మీ మామ చంద్రబాబు ఎంత వెన్నుపోటు దారుడో మీకు తెలియదా..? అని అడిగారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో విడుదల చేసిన వీడియోను బ్రాహ్మణి ఒకసారి చూడాలని కోరారు. అలాగే బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్‌కు సీఐడీ రిమాండ్ రిపోర్ట్ చూపించొద్దు అని కోరారు. ఆ రిపోర్ట్ చూపిస్తే తాత ఇంత అవినీతి పరుగా అని అనుకుంటాడని కామెంట్ చేశారు.
చంద్రబాబు అరెస్ట్‌పై బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలను రోజా ఖండించారు. సీఐడీ ఆఫీసుకు వెళితే చంద్రబాబు అరెస్ట్‌కు గల సాక్ష్యాలను చూపిస్తారని రోజా తెలిపారు. బ్రాహ్మణిని బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారని.. ఆమె తుస్సుమందని రోజా ఎద్దేవా చేశారు.