కర్ణాటక చిక్కమగళూరు(Chikkamagaluru)లోని రెండు హోటళ్లలో మటన్ బిర్యానీలో బీఫ్ కలిపారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. హిందూ సంఘాల నేతల ఫిర్యాదుతో పోలీసులు రెండు హోటళ్ల (Hotels)పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక దాడుల్లో గొడ్డు మాంసంను పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఓ హోటల్ వంటగదిలో బీఫ్ నిల్వ ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు. బిర్యానీ(Biryani)లో బీఫ్ మిక్సింగ్ చేస్తున్నారని పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో తేలడంతో ప్రజలు షాక్ కు గురయ్యారు. (Cops raid eateries) బెంగుళూరు, ఎవరెస్ట్ హోటళ్ల యజమానులకు తాము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పోలీసులు చెప్పారు.
ఈ కేసుకు సంబంధించి లతీఫ్, శివరాజ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు (Police) అరెస్టు చేశారు.ఈ దాడుల్లో వంట గదిలో గొడ్డు మాంసం నిల్వఉంచినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food Safety Authorities) తెలిపారు మటన్ ధర విపరీతంగా ఉన్న నేపధ్యంలో అక్రమ సంపాదనకు తెరతీసిన వ్యాపారులు కొందరు ఎలాంటి లైసెన్స్ లేకుండానే మటన్ విక్రయాలు చేస్తున్నారు.ఇక కొన్ని చోట్ల చికెన్ వ్యాపారులే మటన్ అమ్ముతున్నట్టు గుర్తించారు అధికారులు . కరోనా సమయంలో పౌష్టికాహారం (Nutritious food) తినాలని చెప్తున్న నేపధ్యంలో నిన్నా మొన్నటి దాకా మాంసాహారం అంటే ఆమడ దూరం పారిపోయిన వాళ్ళు ఒక్కసారిగా మాంసాహారం కోసం ఎగబడుతున్నారు .
ఇక మటన్లో బీఫ్ కలుపుతున్నట్లు తాజా తనిఖీల్లో తేలటంతో ఆ వ్యాపారులను గుర్తించి టాస్క్ఫోర్స్(Task Force)కు అప్పగిస్తున్నారు . ఇక అన్ని అంశాలపై 3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు అధికారులు. ఇక గొర్రెల రవాణా నుండి మాంసం కోసి విక్రయించే వరకు జరుగుతున్న అవకతవకలను అన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళటం మాత్రమే కాక ప్రజారోగ్యం(public health)దృష్టిలో పెట్టుకుని పలు సిఫారసులను చెయ్యనున్నారు . ఏది ఏమైనా అధికారుల తనిఖీల్లో సామాన్యులు విస్తు పోయే వాస్తవాలు వెలుగులోకి రావటంతో ఇప్పుడు మళ్ళీ మరోమారు మటన్ తినాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది .