పాత బస్తీ (old city) లో తెల్లవారుజామున నిబంధనలకు విరుద్ధంగా తెరచి ఉంచుతున్న దుకాణాలపై కఠిన చర్యలకు సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న ఇలాంటి మూకలను కట్టడి చేసేందుకు నగర పోలీసులు(Police) సిద్ధమయ్యారు. నంబరు ప్లేట్లు లేకుండా యధేచ్ఛగా రోడ్డుపై కుర్రకారు హల్చల్. దారెంట వెళ్లే ప్రయాణికులు, పాదచారులను భయపెట్టేలా వికృత చేష్టలు. ఇవీ పాతబస్తీ, శివారుల్లో ప్రతిరోజూ జరిగే తంతు. సున్నితమైన ప్రాంతాలు కావటంతో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చారు. దీన్ని అవకాశం చేసుకున్న పాత నేరస్థులు, పోకిరీ ముఠాలు (Gangs) శ్మశానాల్లోనూ పాగా వేస్తూ ఇష్టారాజ్యాంగా వ్యవరిస్తున్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న ఇలాంటి మూకలను కట్టడి చేసేందుకు నగర పోలీసులు సిద్ధమయ్యారు.ఆకతాయిలపై కేసులు నమోదుచేస్తున్నామని పోలీసులు తెలిపారు. కౌన్సెలింగ్‌తో దారికి రాని రౌడీషీటర్ల(Rowdy sheeters)ను బైండోవర్ చేస్తున్నాం. డార్క్స్పాట్లుగా గుర్తించిన 100 ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయబోతున్నాం. పాన్ దుకాణాలు, హోటళ్లు (Hotels) నిబంధనల ప్రకారమే తెరచి ఉంచాలి. ఎక్కడ ఇబ్బంది ఎదురైనా, ఏదైనా సంఘటన గమనించినా డయల్ 100కు ఫోన్ చేసి చెప్పండాని ఆయన అన్నారు.
బండ్లగూడ, చాంద్రాయణగుట్ట(Chandrayanagutta), బార్కస్, సైదాబాద్, మూసారాంబాగ్, ఐఎస్‌సదన్, మలక్‌పేట్, పహడీషరీప్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి, అత్తాపూర్, కార్వాన్ ప్రాంతాల్లో రౌడీ షీటర్ల ప్రైవేటు సెటిల్మెంట్ పెరిగాయి. చోరీ చేసిన బైక్‌లను మైనర్లు/యువకులకు ఇచ్చి అనుచరులుగా మార్చుకుంటున్నారు. మిడ్ నైట్ (Midnight) వీధులు, ప్రధాన మార్గాలు, కాలనీల్లో గుంపులుగా మారి రోడ్లనే బార్లుగా మార్చేస్తున్నారు. అక్కడి వీధి ధీపాలను, సీసీ టీవీ(CCTV)కెమెరాల వైర్లను ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల చాంద్రాయణగుట్ట వద్ద ఓ హోటల్ యజమాని తిన్నదానికి డబ్బులు అడిగాడని కొందరు ఆకతాయిలు తీవ్రంగా కొట్టినట్టు సమాచారం.