తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) సౌందర రాజన్ తొలిసారిగా సందర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆలయంతో పాటు చర్చి, మసీదుల ప్రారంభోత్సవ (Inauguration) కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ముందుగా సచివాలయం వద్దకు చేరుకున్న ఆమెకు మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు. అనంతరం సీఎం కేసీఆర్ (CM KCR) తో పాటు వెళ్లి గవర్నర్ తమిళిసై ఆలయాన్ని ప్రారంభించారు. అనంతరం అదే గుడిలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఆపై ఆలయ ప్రాంగణంలో చేపట్టిన వరలక్ష్మీ దేవి(Varalakshmi Devi) వ్రత పూజలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత.. చర్చిని ప్రారంభించారు. అక్కడే కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇచ్చిన ప్రసాదని సీఎం కెసిఆర్ ప్రక్కకు పెట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా(Social media)లో తెగ వైరలవుతుంది. ప్రసాదన్ని దైవంతో సమానంగా చూస్తారు. సీఎం, గవర్నర్ ఇచ్చిన ప్రసాదన్ని తినకుండా ప్రక్కకు పెట్టడంతో దుమారం రేపింది.