»Governor Tamilisai Bhogi Celebrations At Raj Bhavan Governor Who Cooked Payasam
Governor Tamilisai: రాజ్భవన్లో భోగి వేడుకలు.. పాయసం వండిన గవర్నర్
హైదరాబాద్లోని రాజ్భవన్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ రాజ్భవన్లో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె కుండలో పాయసం వండారు.
Governor Tamilisai: హైదరాబాద్లోని రాజ్భవన్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ రాజ్భవన్లో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమె కుండలో పాయసం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు ఆమె భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమైన పండగని తెలిపారు. ఎందుకంటే చిరకాల స్వప్నం రామ మందిర నిర్మాణం పూర్తి అయినట్లు తెలిపారు. శ్రీరాముడిపై హిందీతో పాటు తెలుగు భాషలో కూడా ఓ పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా సౌభాగ్యంతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది వికసిత్ భారత్ అని ఆమె పేర్కొన్నారు.
#WATCH | Telangana Governor & Puducherry LG Tamilisai Soundararajan celebrates 'Bhogi' at Raj Bhavan in Hyderabad, Telangana.