woman who went down on her knees to become Pawan CM
Pawan: ఒక్కొక్కరీ అభిమానం.. ఒక్కొ మాదిరిగా ఉంటుంది. తమ అభిమాన నటుడు, నటి, రాజకీయ నేత కోసం మొక్కులు చెల్లిస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan) బర్త్ డే ఈ రోజు.. ఆయన రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉన్నారు. వచ్చే ఏడాది ఏపీకి ఎన్నికలు జరగనున్నాయి. సో.. ఆయన సీఎం కావాలని ఓ అభిమాని మొక్కును తీర్చుకుంది.
ఆదోనిలో గల రణమండల కొండపై ఉన్న హనుమంతుడి ఆలయానికి మోకాళ్లపై నడుస్తూ వచ్చింది. అలా 40 కాదు 50 కాదు ఏకంగా 501 మెట్లు ఎక్కింది. తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ పేరుతో పూజ చేసింది. ఆంజనేయ స్వామి పవన్ కల్యాణ్‌పై కరుణ చూపాలని.. సీఎంను చేయాలని మనసారా కోరింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా ఉన్నారు పవన్ కల్యాణ్. నిత్యం ప్రజలతో మమేకం అవుతూ.. ప్రభుత్వ విధానాలను ఏకీ పారేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మోకాళ్లపై మెట్లెక్కిన మహిళ