»Telangana Government Orders To Provide Free Drinking Water In Hotels And Restaurants
Telangana Govt : గుడ్ న్యూస్.. ఇక హోటళ్లు, రెస్టారెంట్లలో వాటర్ ఫ్రీ
హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులకు తాగునీరు ఉచితంగా ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
Telangana Govt : తరచూ హోటళ్లు(Hotel), రెస్టారెంట్లకు వెళ్లే వాళ్లకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) గ్రేటర్ హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులకు తాగునీరు ఉచితంగా ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రాజధాని పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు(Restarent), ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వీధి వ్యాపారులు తప్పని సరిగా జలమండలి సరఫరా చేసే తాగునీరు(Drinking water) గానీ, ఆర్ఓ వాటర్, శుద్ధి చేసిన నీటిని తప్పని సరిగా ఉచితంగా అందించాలని తెలిపింది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్(GHMC) ను ఆదేశించింది.
గతంలో మంచినీరు ఉచితంగానే అందించేవారు. ఇటీవల కాలంలో మంచినీరు ఇస్తున్నా అవి అంత స్వచ్ఛంగా ఉండటం లేదనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా రెస్టారెంట్, హోటళ్లలో వాటర్ బాటిల్ ను అధిక ధరలకు అమ్ముతున్నారు. హోటల్, రెస్టారెంట్ లో మంచినీరు స్వచ్ఛంగా లేకపోవడంతో కస్టమర్లు తప్పకుండా వాటర్ బాటిల్(Water bottle) ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లలో మంచినీరు ఉచితంగా అందించాలని సూచించింది. ఒకవేళ వాటర్ బాటిల్స్ సరఫరా చేస్తే ఆయా బాటిల్స్ పై ముద్రించిన గరిష్ట ధరను మాత్రమే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.